GST Council Meeting: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈరోజు జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఇన్ష్యూరెన్స్, లగ్జరీ ప్రోడక్ట్స్, ఇంకా వాహన రంగాలకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నేటి జీఎస్టీ కౌన్సిల్ లో మొత్తం 148 అంశాలపై చర్చ జరగనునుంది. ఇందులో ముఖ్యంగా లైఫ్, హెల్త్ ఇన్ష్యూరెన్స్ అంశం చర్చనీయాంశంగా మారనుంది.…