శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హెల్త్ టూరిజం హబ్ 500 నుంచి 1000 ఎకరాల్లో విస్తరించి దానికి అనుగుణంగా భూమిని సేకరించనున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటితో పోటీపడి ఈ హబ్‌లో అన్ని వ్యాధులకు నాణ్యమైన చికిత్స అందించాలనే ఆలోచన ఉంది. హబ్‌లో తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అన్ని అగ్రశ్రేణి సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి శనివారం ఇక్కడ తెలిపారు.…
వరంగల్ దశ తిరగనుందా? ఓరుల్లు ఇక హెల్త్ సిటీగా రూపుదిద్దుకోనుందా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఎంతో చారిత్రక నేపథ్యం వున్న వరంగల్ నగరంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మాణానికి సంబంధించి జీవో విడుదలైంది. 15 ఎకరాల్లో 1,100 కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలకు అనుమతి మంజూరు చేస్తూ జీవో జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. 24 ఫ్లోర్లతో భారీ భవన సముదాయం, 2,000 పడకలు ఇక్కడ ఏర్పాటుచేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ కోసం…