మంకీపాక్స్ వైరస్ కలకలంరేపుతోంది. ఇప్పటికే దాదాపు 50కి పైగా దేశాలకు విస్తరించింది. సుమారు 700 కిపైగా కేసులు బయట పడ్డాయి. మంకీపాక్స్ పేరు వినగా ప్రజలంతా జంకిపోతున్నారు. ఇక ఈవైరస్ ఫ్రాన్స్‌ను వణికిస్తోంది. దేశంలో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. ఈ యూరోపియన్ దేశంలో మొదటి మంకీపాక్స్ కేసు మే నెలలో వెలుగు చూసింది.…