(జూన్ 12న హీరో గోపీచంద్ పుట్టినరోజు)“ఎక్కడ పారేసుకుంటామో, అక్కడే వెదకాలి” అంటారు పెద్దలు. గోపీచంద్ మనసు చిత్రసీమలో పారేసుకున్నాడు. కాబట్టి, అక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపించాడు. చివరకు అనుకున్నది సాధించి, హీరోగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మాస్ హీరోగా పలు చిత్రాలలో జనాన్ని అలరించిన గోపీచంద్, ఓ నాటి ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ తనయుడు! టి.కృష్ణ దర్శకత్వంలో అనేక అభ్యుదయభావాలతో చిత్రాలు రూపొంది విజయం సాధించాయి. వాటిలో ‘ప్రతిఘటన’ చిత్రం మరపురానిది. గోపీచంద్ అన్న ప్రేమ్…