ప్రముఖ తమిళ నటుడు సూర్య 39వ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ అతని పుట్టిన రోజు సందర్భంగా వెలువడింది. సొంత బ్యానర్ 2 డి ఎంటర్ టైన్ మెంట్ లో టి. జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య నిర్మిస్తున్న చిత్రానికి ‘జై భీమ్’ అనే పేరును ఖరారు చేశారు. రాజీషా విజయన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సూర్య న్యాయవాదిగా కనిపిస్తుండటం విశేషం. సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన గిరిజనుల హక్కులకై న్యాయపోరాటం చేసే వకీల్…