(అక్టోబర్ 14న పి.చంద్రశేఖర రెడ్డి బర్త్ డే)సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రాలను రూపొందించడంలో మేటి అనిపించుకున్నారు పి.చంద్రశేఖర రెడ్డి. ఆయన చిత్రాల నిండా ఫ్యామిలీ సెంటిమెంట్ సెంటులా సువాసనలు వెదజల్లేది. చంద్రశేఖర రెడ్డి తన చిత్రాలలో కథనాన్ని నడిపిన తీరును ఆ తరువాత ఎంతోమంది అనుసరించడం గమనార్హం! హీరో కృష్ణను స్టార్ గా నిలపడంలోనూ చంద్రశేఖర రెడ్డి చిత్రాలు భలేగా పనిచేశాయి. కొన్ని యాక్షన్ మూవీస్ సైతం చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కినా, ఆయన పేరు…