‘జాంబీరెడ్డి’తో జాంబీస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ జోనర్ పరిచయం చేయబోతున్నాడు. తన జాంబిరెడ్డి హీరో తేజ సజ్జతో ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను–మాన్’ను లాంఛనంగా ఆరంభించాడు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్నిఅత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందించనున్నారు. ఇటీవల విడుదలైన హను-మాన్ టైటిల్, టైటిల్ టీజర్ కి చక్కటి స్పందన లభించింది.…