Congress: హర్యానా కాంగ్రెస్‌లో లుకలుకలు.. ఓటమి సమీక్షకి సెల్జా, సూర్జేవాలకు అందని ఆహ్వానం..
- హర్యానా కాంగ్రెస్‌లో లుకలుకలు..
- కీలక భేటీకి కుమారి సెల్జా.. సుర్జేవాలాకి అందని ఆహ్వానం..
- అంతర్గత విభేదాలే కారణమంటున్న విశ్లేషకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీలో విభేదాలకు కారణమవుతోంది. హర్యానాలో ఈసారి అధికారం కాంగ్రెస్‌దే అని అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చెప్పాయి., అయితే తీరా ఫలితాలు చూస్తే, బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో 48 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 37 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, అతివిశ్వాసమే ఆ పార్టీ కొంపముంచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే, ఈ విభేదాలు నెమ్మదిగా బయటపడుతున్నాయి. హరాన్యా ఓటమిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ భేటీకి రాహుల్ గాంధీ, ఎమ్మెల్యేలు భూపీందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, ప్రతాప్ సింగ్ బజ్వా వంటి కాంగ్రెస్ నేతలకు హజరయ్యారు. అయితే, ఈ సమావేశాలకు రణదీప్ సింగ్ సుర్జేవాలా, కుమారి సెల్జాకు ఆహ్వానాలు అందలేదు.
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
Read Also: Ratan Tata: టాటా ఇండికా నుంచి నెక్సాన్ ఈవీ వరకు.. భారత ఆటో ఇండస్ట్రీపై చెరగని సంతకం రతన్ టాటా..
హర్యానా ఓటమి ప్రధాన ఎజెండాగానే సమావేశం జరుగుతుంది. ఈవీఎంలు, అంతర్గత విభేదాలు ఓటమికి కారణాలా..? అనే అంశాలను కూడా సమావేశంలో చర్చించారు. రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై ఓటమి ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై చర్చించారు. హర్యానా ఓటమి తర్వాత కాంగ్రెస్ మిత్ర పక్షాలు కూడా విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కూడా ప్రధాన చర్చ నడిచినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.
ముఖ్యంగా హర్యానాలో కీలక నేతలైన భూపిందర్ సింగ్ హుడా, కుమారి షెల్జా మధ్య విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. పలు సమావేశాల్లో ఈ విషయం బయటపడింది. వీరిద్దరి మధ్య కొన్ని నెలులుగా మాటలు లేవు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ సమావేశంలో వేదికపైనే మహిళా కాంగ్రెస్ నేతని లైంగికంగా వేధించడాన్ని సెల్జా ప్రశ్నించారు. షెల్జాకి మద్దతుదారుగా ఉన్న వ్యక్తిని ఓడించేందుకు హుడాలు ఇండిపెండెంట్ వ్యక్తిని బరిలోకి దించినట్లు వార్తలు వచ్చాయి.
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!