Haryana: ముందు నువ్వు చస్తావా.. నేను చావనా.. పందెం వేసుకున్న తాగుబోతులు.. సీన్ కట్ చేస్తే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: చుక్క పడిందో చుక్కల్లో తేలినట్టుంటది.. ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితి. ఒంటి సోయి మర్చిపోయి ప్రాణాలపైకి తెచ్చుకుంటారు మందుబాబులు. మందు ఎంతటి పనైనా చేయిస్తుంది.భయం పొగొడుతుంది. ధైర్యం లేని వాళ్లకు తెప్పిస్తుంది. బలహీనుల్ని బలవంతులను చేస్తుంది. అందుకే ఏ పోరుకైనా ఎంతటి రిస్క్ చేయడానికైనా తాగుబోతులు తొడగొడతారు.. కానీ అదే బెడిసికొడితే.. ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. హర్యానాలోని సోనేపట్‌లోని జట్వారా గ్రామానికి చెందిన ముఖేష్, అతడి స్నేహితుడు మను ఇద్దరూ దుప్పట్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
Read Also: Bandi Sanjay: భార్య పిల్లను వదిలేసి ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నా
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
బుధవారం ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం ముఖేష్ సోదరి ఇంట్లో భోజనం చేశారు. బయటకు వెళ్లిన తర్వాత ఇద్దరూ పందెం కాశారు. ఎవరు ముందుగా చనిపోతారు అనేది పందెం యొక్క సారాంశం. ఈ క్రమంలో రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. రైలు వస్తుండగా మద్యం మత్తులో ఉన్న మను.. పందెం ప్రకారం ముఖేష్‌ను రైలు ముందుకి తోశాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తు దిగిన మను అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: WITNESS: మాన్యువల్ స్కావెంజింగ్ నేపథ్యంలో ‘విట్ నెస్’!
సోనేపట్‌లోని సివిల్ ఆస్పత్రిలో ముఖేష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. ఘటన సమయంలో జట్వాడ గ్రామానికి చెందిన కుల్‌దీప్, దీపక్‌లు అక్కడే ఉన్నారని జీఆర్‌పీ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ధర్మపాల్ తెలిపారు. ముఖేష్, మను ఇద్దరూ మత్తులో ఎవరు ముందుగా చనిపోతారో చూడాలని పందెం వేశారని వారు పోలీసులకు తెలిపారు. అయితే మను ముఖేష్‌ను రైలు ముందుకు నెట్టడంతో ముఖేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!