Haryana Roadways Honours Driver, Conductor Who Rescued Rishabh Pant: భయంకరమైన కారు ప్రమాదం నుంచి స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలతో బయటపడ్డారు. అతడిని కాపాడి హీరోలుగా నిలిచారు బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజీత్. వీరిద్దరే లేకుంటే రిషబ్ పంత్ ప్రాణాలతో ఉండే వారు కాదని తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ ను కాపాడిని వీరిద్దరు అసలైన హీరోలుగా నిలిచారు. తాజాగా హర్యానా రోడ్ వేస్ శుక్రవారం వీరిద్దరిని సన్మానించింది. రాష్ట్రప్రభుత్వం కూడా వీరిద్దరిని గౌరవించే అవకాశం ఉందని తెలుస్తోంది.
హర్యానా ఆర్టీసీ తరుపున వీరిద్దరిని అధికారులు సత్కరించారు. హర్యానా రోడ్‌వేస్ పానిపట్ డిపో జనరల్ మేనేజర్ కుల్దీప్ జంగ్రా వారికి ప్రశంసాపత్రం, షీల్డ్ అందించారు. డ్రైవర్, కండాక్టర్లు మానవత్వానికి ఉదాహరణగా నిలిచారని జాంగ్రా అన్నారు. హరిద్వార్ నుంచి ఉదయం 4.20 గంటలకు పానిపట్ కు బయలుదేరిన గంటలకు రిషబ్ పంత్ కార్ ప్రమాదానికి గురైన స్థలానికి చేరుకుంది. ఆ సమయంలో సహాయం చేయడానికి వీరద్దరు పరిగెత్తుకుంటూ కారు వద్దకు వెళ్లి, పంత్ ను కారు నుంచి బయటకు తీశారు.
Read Also: Rishabh Pant: రిషబ్ పంత్ ను కాపాడిన హీరో ఇతనే.. ఏమన్నాడంటే..?
ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. తల్లిని సర్ప్రైజ్ చేసేందుకు పంత్ స్వగ్రామం రూర్కీ బయలుదేరిన సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం అయింది. హర్యానా రవాణా మంత్రి మూల్ చంద్ శర్మ మాట్లాడుతూ సుశీల్, పరంజీత్ ఇద్దరు మానవత్వానికి ఉదాహరణగా నిలిచారని ప్రశంసించారు. హర్యానా ప్రిన్సిపల్ సెక్రటరీ (రవాణా), నవదీప్ విర్క్ కూడా వీరిద్దరిపై ప్రశంసలు కురిపించారు.
కారులో నుంచి రిషబ్ పంత్ ను బయటకు తీసిన 5-7 సెకన్లలో కారు అంతా మంటలు వ్యాపించాయని.. రిషబ్ పంత్ వీపు భాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయని, అతడిని ఎంక్వైరీ చేయగా ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ అని తెలిసిందని పరంజీత్ అన్నారు.