Ravan idol: దసరా వేడుకల భాగంలో ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమాల్లో కొన్ని చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. దిష్టిబొమ్మను దహనం చేయడంతో నిప్పు రవ్వలు ఎగిరి జనంపై పడ్డాయి. దీంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ ఘటనలకు సంబంధించిన పలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయదశమి నాడు ప్రజలు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం ద్వారా దసరాను జరుపుకుంటారు. అయితే దసరా వేడుకల్లో ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో బుధవారం రావణుడి దిష్టిబొమ్మను దహనం చేశారు నిర్వాహకులు. ఆ సమయంలో నిప్పురవ్వలు ఎగిరి జనంపోలీసులపై పడ్డాయి. భయంతో అక్కడ వారు పరుగులు తీశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజరాయ్ ప్రభుత్వ ఇంటర్ కళాశాల మైదానంలో చోటు చేసుకుంది.
Read Also: No charges for credit card use: క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక, ఛార్జీలు లేవు..!
హర్యానాలోని యమునానగర్‌లో కూడా ఇదే తరహాలో రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని యమునానగర్ పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం యమునానగర్ గ్రౌండ్ లో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు మైదానంలోకి చేరుకున్నారు. రావణుడి దిష్టి బొమ్మకు నిప్పు పెట్టారు. దాదాపుగా పైవరకు మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో గాలి వీయడంతో కుదుపునకు గురైన రావణుడి బొమ్మ తగలబడుతున్న మంటలతోనే ఒక పక్కకు ఒరిగి కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయాలయ్యాయి. సమీపంలో నిలబడి జనం అక్కడి నుంచి దూరంగా పరుగులు తీసేందుకు ప్రయత్నించారు. రావణుడి బొమ్మ ఎత్తులో ఉండటంతో దాని పొడవును దాటుకుని తప్పించుకుని పోలేకపోయారు.
బొమ్మ కింద మంటల్లో చిక్కుకుపోయిన వారిని స్థానికులు ప్రాణాలకు తెగించి బయటికి లాక్కొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పి గాయాలతో బయటపడ్డారు. లేదంటే ఊహించని నష్టం జరిగిపోయి ఉండేది. ఇక,ఈ ప్రమాదంలో గాయపడినవారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. రాముడు రావణుడిని వధించిన రోజుని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటారు.
मुज़फ़्फ़रनगर में अपने को जलाए जाने से क्रुद्ध रावण ने मौक़े पर मौजूद लोगों पर अग्नि-वाण चलाए 😬 pic.twitter.com/zuDmH3dKXa
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) October 5, 2022