Hookah Ban: హుక్కాప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఇకపై రెస్టారెంట్లు, హోటళ్లలో నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: హర్యానా ప్రభుత్వం హుక్కా ప్రియులకు చేదువార్త అందించింది. హర్యానాలోని హోటళ్లు, బార్‌లు, రెస్టారెంట్లలో ఇకపై హుక్కాను ప్రభుత్వం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా అందించడాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సోమవారం ప్రకటించారు.రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చడంలో ఇది ఒక ముఖ్యమైన చర్య అని అన్నారు. సోమవారం నాడు డీ-అడిక్షన్ ప్రచారానికి సైక్లోథాన్ ముగింపు కార్యక్రమంలో మనోహర్ ఖట్టర్ పాల్గొన్నారు. డ్రగ్స్‌ను అరికట్టాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
Also Read: PM Modi: గత 30 రోజుల్లో భారతదేశ దౌత్యం కొత్త శిఖరాలను తాకింది
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
25 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సైకిల్ తొక్కిన పోలీసులను ప్రశంసిస్తూ.. మనోహర్‌లాల్ ఖట్టర్ వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తామని ప్రకటించారు. ఇందులో పాల్గొన్న 250 మందికి హర్యానా డీజీపీ నుంచి క్లాస్-1 కమెండేషన్ సర్టిఫికెట్ లభిస్తుందని మనోహల్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇందులో నిమగ్నమైన పోలీసులకు ఐదు రోజుల సెలవులు కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. సైక్లోథాన్ ముగిసినా డ్రగ్స్ బెడద ఇంకా అంతం కాలేదన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సమాజం ఏకం కావాలని ఆయన సమాజ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Afghanistan: ప్రపంచంలో “అత్యుత్తమ కరెన్సీ పనితీరు”లో ఆఫ్ఘనిస్తాన్ టాప్.
రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు ‘హుక్కా’ అందించడాన్ని నిషేధిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అయితే, హర్యానా ప్రభుత్వ నిషేధం గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే సాంప్రదాయ హుక్కాలకు వర్తించదు. ఈ మేరకు సర్కారు ప్రకటించింది. హర్యానా అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా వాణిజ్య సంస్థలు హుక్కా సేవలను నిలిపివేయాలని డిమాండ్ చేసిన కొన్ని నెలల తర్వాత ఈ నిషేధం వచ్చింది.ఈ విషయమై గుప్తా మే నెలలో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బార్‌లు, క్లబ్‌లలో హుక్కా తాగడం “బర్నింగ్ ప్రాబ్లమ్” అని స్పీకర్ అభివర్ణించారు. దానిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సెప్టెంబర్ 1న సైక్లోథాన్‌ను ప్రారంభించి సోమవారం (సెప్టెంబర్ 25) ముగించారు. 25 రోజుల పరుగులో సైక్లోథాన్ సుమారు 2,000 కిలోమీటర్లు ప్రయాణించింది.
Also Read: Gurpatwant Singh Pannun: ఇండియాను విభజించి అనేక దేశాలు చేయాలనుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాది..
కర్ణాటకలో ఇలా.,
కర్ణాటక ప్రభుత్వం హుక్కా బార్‌లను నిషేధించాలని, పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసే కనీస వయస్సును 21 ఏళ్లకు పెంచాలని యోచిస్తున్నట్లు వారం క్రితం నివేదిక వెలువడింది. ఈ మార్పులను తీసుకురావడానికి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల యువకుల వరకు హుక్కా బార్లను సందర్శిస్తున్నారని, పొగాకు వినియోగం మానేయాలని, అందుకోసం చట్టం తీసుకురావాలని గుండురావు అన్నారు. ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమావేశమై, పాఠశాలలతో పాటు, దేవాలయాలు, మసీదులు, పిల్లల సంరక్షణ కేంద్రాలు, ఆసుపత్రుల చుట్టూ కూడా పొగాకు ఉత్పత్తుల అమ్మకం, వినియోగం నిషేధించబడింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?