హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి ముందు గాంధీ విగ్రహ ఏర్పాటుకు నిర్మాణ పనులను మంత్రులు హరీష్ రావు, తలసాని పరీశీలించారు. అక్టోబర్ 2న గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.
బీజేపీ విజయ సంకల్ప సభ వేదికగా బీజేపీ శ్రేణులు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఎం మోడీ సహా కేంద్ర మంత్రులు ఎవ్వరూ రాష్ట్రానికి ఉపయోగపడే మాట ఒక్కటి కూడా చెప్పలేదని విమర్శించారు. కాగా.. తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. అంతేకాకుండా.. అహ్మదాబాద్ పేరును అదానీబాద్‌గా ఎందుకు మార్చారంటూ ట్వీట్ చేశారు. కాగా.. సభసమావేశాల్లో…
జూనియర్ డాక్టర్లతో సేవ చేయించుకున్నారు. స్టైఫండ్ మాత్రం ఇవ్వలేదు. అడిగిన ప్రతిసారి రేపు, ఎల్లుండి అని దాట వేశారు. ఇప్పుడు వాళ్ల ఇంటర్నషిప్ కూడా పూర్తయిపోయింది. మరి మా స్టైఫండ్ సంగతి ఏమిటని ప్రశ్నిస్తే… ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు అధికారులు. ఇంతకీ ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏం జరుగుతోంది..? తెలంగాణలో ఎక్కడా లేని పరిస్థితి ఇక్కడే ఎందుకు ఎదురవుతోంది..? ఆదిలాబాద్ రిమ్స్‌లో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ అంశం మళ్లీ మొదటికొచ్చింది. ఇంత కాలం ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసిన…
ఇవాళ మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించనున్నారు. ఉదయం 11.00 గంటలకు మెదక్ లోని 100 పడకల మతాశిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు దళిత బంధు పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు వాహనాలను హరీష్ రావు అందజేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేసి, మధ్యాహ్నం 1:30 గంటలకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. Bank Robbery:…
కాంగ్రెస్ అంటే గతం. ప్రస్తుతం ఆగమాగం అంటూ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఎద్దేవ చేశారు. అమీర్ పేట్ 50 పడకల ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గీతారెడ్డి, జంగారెడ్డి కళ్లు ఉండి లేనట్లు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. వాళ్ల హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దావాఖానా అని పాడేవారు. ఇప్పుడు సర్కారు ఆసుపత్రికే పోతా అని అంటున్నారని ఎద్దేవ చేశారు. గీతారెడ్డి…
ప్రజలందరికీ అధికార సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని తెలిపారు. రూ.5 కోట్లతో మండల కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. మండల కేంద్రమైన ములుగు అభివృద్ధి కై రూ.10 కోట్లు మంజూరు చేసుకున్నామని అన్నారు. మన ఊరు-మన బడి కింద 7300 కోట్లు వెచ్చించి, ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో తరగతులు ప్రారంభిస్తున్నామని…
ఒకపార్టీ నేత ఏమో ఓటుకు నోటు కేసు దొంగ ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ చీఫ్ అంటూ మంత్రి హరీశ్ రావ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఇంకో పార్టీ నేతలేమో పదవుల కోసం కోట్లు డిమాండ్ చేసే పార్టీకి చెందినవారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో బీజేపీ సీఎం సీటుకు రు. 2500 కోట్లు ఇవ్వాలట, ఆ పార్టీ ఎమ్మెల్యేనే మొన్న ఈ విషయం చెప్పారని మంత్రి హరీశ్ రావ్ అన్నారు.…