Harish Rao: కాంగ్రెస్ అంటే గతం. ప్రస్తుతం ఆగమాగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అంటే గతం. ప్రస్తుతం ఆగమాగం అంటూ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఎద్దేవ చేశారు. అమీర్ పేట్ 50 పడకల ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గీతారెడ్డి, జంగారెడ్డి కళ్లు ఉండి లేనట్లు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. వాళ్ల హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దావాఖానా అని పాడేవారు. ఇప్పుడు సర్కారు ఆసుపత్రికే పోతా అని అంటున్నారని ఎద్దేవ చేశారు. గీతారెడ్డి డాక్టర్ అయ్యు ఉండి ఇలా మాట్లాడటం తగదని మండిపడ్డారు. సంగారెడ్డి ఆసుపత్రి జగ్గారెడ్డి వెళ్లి అభినందించారని అన్నారు. సంగారెడ్డి మెడికల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మీ పక్కనే ఉన్నారు అడగండని తెలిపారు.
సీఎం.. గాంధీ ఆసుపత్రి తిరిగి రోగులకు ధైర్యం నింపారని అన్నారు. ఉస్మానియ వెళ్లి 200 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. కానీ.. కొందరు కోర్టుకు వెళ్లారని తెలిపారు. డిల్లీ ఆసుపత్రి వెళ్తే విమర్శించారు. మంచి ఎక్కడ ఉన్నా తీసుకుంటామని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. మీ హయాంలో జిల్లా మెడికల్ కాలేజీ పెట్టాలని సోయి ఉందా? అంటూ ప్రశ్నించారు. 70 ఏళ్లల్లో 3 మెడికల్ కాలేజీలు ఉంటే, 7 ఏళ్లలో 33 కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. కాలేజీలు పెడితే ఎందుకు పిల్లలు ఉక్రెయిన్, చైనా వెళ్ళాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
Also Read
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
కాంగ్రెస్ అంటే ఏసీ కార్లలో ఉంటారు..మేము బస్తీల్లో ఉంటామని హరీశ్ రావ్ అన్నారు. ఒక లీడర్ కు మరొక లీడర్ కు మాటలకు పొంతన ఉండదని విమర్శించారు. కాంగ్రెస్ మాటల పార్టీ, చేతల పార్టీ అంటూ మండిపడ్డారు. నాడు వానాకాలంలో ఏజెన్సీలు మంచం పట్టెవి ఇప్పుడు ఉన్నాయా.. అంటూ ప్రశ్నించారు. మీ జహీరాబాద్ ఆసుపత్రి చూడు.. ఏమేమెం చేశామో అంటూ మంత్రి హరీశ్ రావ్ చురుకలంటించారు.
కాంగ్రెస్ నాయకులకు సర్కారు దవాఖానలో విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. 2014 లో 17000 పడకలు, 27 వేల పడకలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇది కాదా అభివృద్ధి. మీ పాలన కంటే ఆసుపత్రులు బాగు చేశామని పేర్కొన్నారు. 15 లక్షల కాన్పులు చేసామని, 1500 కోట్లు అదనంగా చేశామని అన్నారు. కోఠిలో 50 లక్షల మందికి కళ్ళ పరీక్ష చేశామని గుర్తు చేశారు.
ఆరోగ్య శ్రీ గురించి మాట్లాడుతూ..
2 నుండి 5 లక్షలకు పెంచామని, 3.60 లక్షల మంది సేవలు పొందారని, 850 కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. లిస్ట్ పంపిస్తా వెళ్లి అడగండి. రండి సర్కార్ దావాఖాలను ఎలా ఉన్నాయో చూడండంటూ తెలిపారు. మేము రోజూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటున్నాం. కళ్ళు ఉండి చూడలేని కబోధిల్లా ఉంది మీ వ్యవహారమంటూ.. మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, నీటి అయోగ చెప్పయీ. మనం దేశంలో మూడో స్థానంలో ఉన్నామని అంటూ గుర్గు చేశారు.
ఏం.ఎం.ఆర్ గణనీయంగా తగ్గింది 56 కి తగ్గించాం.. తమిళనాడును దాటామని అన్నారు. ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాలని ఆలోచన ఉందా ? అంటూ ప్రశ్నించారు. నాలుగు టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. హైదరబాద్ లోనే 6000 సూపర్ స్పెషాలిటీ పడకలు రాబోతున్నాయని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావ్ అన్నారు.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి