కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద విచారణ వేసిన తర్వాత తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత.?అని ఆమె వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ను అవినీతి ఆరోపణలతో లాగడం వెనుక హరీష్‌రావే కారణమని కవిత సంచలన ఆరోపణ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. పీసీ ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్ల లాగే విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణ ఉంటుందని హైకోర్టు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు…
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవినీతి ఆరోపణలపై మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దొర.. దోపిడి దొంగగా మారి ప్రజల సొమ్ము దోచుకున్నారని విమర్శించారు. ఆనాడు వేసిన శిక్షల మాదిరిగా రాళ్లతో కొట్టలేదని, నడి రోడ్డులో ఉరి వేయలేదని.. పద్ధతి ప్రకారం విచారణకు ఆదేశాలు ఇచ్చాం అని పేర్కొన్నారు. కేసీఆర్.. ఆయన మనువడు వరకు పరిపాలన చేయాలని ఆశ పడ్డారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు లక్ష కోట్ల అప్పు ఎలా వచ్చింది?,…
అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు, సభ నిర్వహణపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదిక హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు సభలో కాళేశ్వరం నివేదిక పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని హరీష్‌రావు పిటిషన్ వేశారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలివ్వాలని హరీష్‌రావు కోర్టుకు విన్నవించారు.ా Also Read:Heart Attack: డ్యూటీలో ఉండగా…
High Court refuses to issue interim orders for KCR: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తిస్థాయి కౌంటర్‌ను దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం కేసీఆర్, హరీష్‌రావు…
రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ మ్యూసీ నదికి గోదావరి నీళ్లు తీసుకువెళ్తామన్న వ్యాఖ్యలపై హరీష్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన రైతుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.