Home
Harish Rao
Harish Rao News
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ వద్ద ఉద్రిక్తత, ఆవేశాల మధ్య రైతులు చేపట్టిన పాదయాత్రలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. రంగనాయక సాగర్‌ను నీటితో నింపాలన్న ఒకే ఒక్క ఆకాంక్షతో చిన్నకోడూరు రైతులు స్వచ్ఛందంగా ఈ పాదయాత్ర చేపట్టారని, ఇది బీఆర్ఎస్ పెట్టిన యాత్ర కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఇది కాలం తెచ్చిన కరువు కాదు,… -
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తోందని మండిపడ్డారు. “ఒకప్పుడు కరెంట్ పోతే వార్త.. కానీ ఈ చేతకాని ప్రభుత్వ పాలనలో ఇప్పుడు కరెంట్ ఉంటేనే వార్తగా మారింది” అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే 11 జిల్లాల్లో భారీ ఎత్తున… -
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
Harish Rao : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు సుప్రీంకోర్టు సాక్షిగా బయటపడ్డాయని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొదటి నుంచి రాజకీయ కాంక్ష తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ధ్వజమెత్తారు. తన రాజకీయ గురువు (చంద్రబాబు) కి గురుప్రదక్షిణ చెల్లించుకునేందుకే సీఎం రేవంత్ ఆరాటపడుతున్నారని విమర్శించారు. గోదావరి, నల్లమల కేసులో సుప్రీంకోర్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి మొట్టికాయలు వేసిందని,… -
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
Jagga Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు , సాగునీటి అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి ప్రధాన కారణమైన కేసీఆర్, హరీష్ రావులు ముందు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేసి, రాష్ట్రానికి భారీ నష్టం చేకూర్చినందుకు గానూ ముక్కు నేలకు రాసి, ఆ… -
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిర్మించిన ఆస్పత్రిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రారంభించలేకపోయిందని మండిపడ్డారు. పటాన్చెరులో ఐటీ పార్కు ఏర్పాటు కోసం గతంలో భూమిని కేటాయిస్తే, సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ భూమిని అమ్మేశారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో కనురెప్ప కొట్టేంత… -
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
Harish Rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న ఓ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర సీఎం మాట్లాడిన మాటలు వింటుంటే సైకో లాగా, శాడిస్ట్ లాగా ఉందే తప్ప బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిలా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎండలకు ఎండిపోతున్న పొలాలకు నీళ్లు పారించమని ప్రతిపక్షాలు కోరుతుంటే, ముఖ్యమంత్రి మాత్రం దానికి సమాధానం చెప్పకుండా నోటికి వచ్చినట్లు బూతులు పారిస్తున్నారని ఆగ్రహం… -
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరుగురి హత్యోదంతంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘోర సామూహిక హత్య హృదయవిదారకమైనదని, ఈ ఘటనతో రాష్ట్రంలోని ఆడపిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వ పూర్తి వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని దుయ్యబట్టారు. న్యాయం కోసం బాధితులు నెలల తరబడి… -
Harish Rao : సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం నీళ్లను చూడండి.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా సిద్దిపేటకు వచ్చి, అక్కడ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను కళ్లారా చూడాలని ఆయన సవాల్ విసిరారు. “రంగనాయక సాగర్‌లోకి వస్తున్న నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి” అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుల వల్లే తెలంగాణలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట పరిధిలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు నీటి… -
Harish Rao: “త్వరలో భారీ పాదయాత్ర చేయబోతున్నా”.. హరీష్ రావు సంచలన ప్రకటన..
Harish Rao: సంగారెడ్డి ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం త్వరలోనే తాను సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారీ పాదయాత్ర చేపడతానని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. జిల్లాలోని ప్రధాన నీటి వనరు అయిన సింగూరు ప్రాజెక్టులో ఉన్న నీళ్లన్నింటినీ ప్రభుత్వం ఖాళీ చేసిందని ఆరోపించారు. రైతులకు క్రాప్ హాలిడే (పంట విరామం) ప్రకటించి కూడా వారికి ఇవ్వాల్సిన కనీస పరిహారాన్ని అందజేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న పంటల బీమా… -
Harish Rao: మెచ్చుకోవాల్సింది పోయి.. ఏంటి ఈ చిల్లర రాజకీయాలు.?
Harish Rao: తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్, తుమ్మిడిహట్టి, నీటి పారుదల ప్రాజెక్టులు, రైతులకు సాగునీటి అంశాలపై ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఇరిగేషన్‌పై కనీస అవగాహన కూడా లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గోదావరిలో ప్రస్తుతం లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా ప్రభుత్వం కన్నెపల్లి…
తాజావార్తలు
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
Dhanteras 2026: లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి? బంగారం కొనడానికి సరైన సమయం ఏది..?
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..