ఇంకో 15 రోజుల్లో గజ్వేల్ క్యాంపు ఆఫీస్ కి మాజీ సీఎం కేసీఆర్ వస్తారు.. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు కావట్లేదు.. అక్కడ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నది అని సర్వేలు చెబుతున్నాయి.. కేసీఆర్ గజ్వేల్ ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ వాళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు.. పీఎసీఎస్ (PACS) చైర్మన్లు, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ లని బెదిరించి అక్రమ కేసులు పెడుతున్నారు అని హరీష్ రావు అన్నారు.
రాష్ట్రంలో గత పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన పలు కార్యక్రమాల వల్లనే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు బుధవారం అన్నారు. బహుమితీయ పేదరిక సూచీ 13.18 శాతం నుంచి 3.76 శాతానికి బాగా క్షీణించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం పేరుతో సాగుతున్న దుష్ప్రచారాలకు తగిన సమాధానం. తదుపరి పార్లమెంట్ ఎన్నికల కోసం నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం యొక్క సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, NITI…
Harish Rao: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఫోన్ చేశారు. రైతులకు సాగునీటి కోసం రంగనాయక సాగర్ లోకి నీటిని పంపింగ్ చేయాలని కోరారు.
Harish Rao: ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం జీడిపల్లిలో
తెలంగాణ భవన్ లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ కి చూపెట్టింది ట్రైలర్ మాత్రమే.. ముందు ముందు అసలు సినిమా ఉంటది అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిసెంబర్ లో మొదటిసారిగా సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై, ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగానే విమర్శలు చేసింది. అయినప్పటికీ సీఎం, మంత్రులు ఆ విమర్శలకు కౌంటర్…
మాతృభాష కోసం నా ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.. న్యూజిలాండ్ 170 ఏళ్ల పార్లమెంట్ చరిత్రలో అతి పిన్న వయస్కురాలు అయిన సాల్ ఎంపీ హనా-రౌహితి-మాపి-క్లార్క్ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌లోని తెగలలో మావోరీ భాష దాదాపు అంతరించిపోయింది. న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రకారం.. మావోరీ ప్రజల భాషతో పాటు హక్కులను రక్షించడానికి ఈ యువ ఎంపీ పోరాడుతుంది. అయితే, కొన్ని రోజుల క్రితం ఎంపీ హనా రౌహితి పార్లమెంటులో ప్రసంగం చేస్తూ.. మావోరీ…
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త్వరలో ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు శనివారం అన్నారు. తెలంగాణ భవన్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ శస్త్రచికిత్స తర్వాత చంద్రశేఖర్‌రావు కోలుకుంటున్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మనముందుకు వస్తారన్నారు. ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్లో చంద్రశేఖర్‌రావు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. రోజు వారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో మమేకమవుతారు. జిల్లాల్లోనూ పర్యటిస్తానని హరీష్ రావు…
అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారని, కేటీఆర్.. హరీష్ బస్సులో తిరిగరు.. వాళ్లంతా బెంజ్ కార్ల లో తిరుగుతారు కాబట్టి వాళ్లకు ఆర్టీసీ బస్సు తెలియదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు కేటీఆర్.. హరీష్ అని, నేను సభలో ఉంటే హరీష్..కేటీఆర్ ని ఆడుకునే వాణ్ణి అన్నారు. టైం బాగోలేక ఓడిపోయినని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్.. హరీష్ కి సవాల్..…
కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన దుబ్బాకలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణకి అన్యాయం చేస్తున్నాయన్నారు. బీజేపీ అడుగులకు మాడుగుల ఒత్తే పార్టీ కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని బీజేపీ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాతే కాంగ్రెస్…