Harish Rao Campaign in Medak: 2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉందని, ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగు లాగా ఉందని, ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో పడిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్నివర్గాల్ని మోసం చేసిందని, ఏ మొహం పెట్టుకొని…
ఎన్నికల్లో ప్రియాంకా గాంధీతో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి, నిండు అసెంబ్లీలో చేతులెత్తేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరువును వెంట తీసుకువచ్చిందన్నారు. సిద్దిపేటలో రేవంత్ రెడ్డి 150 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేశాడు…వెటర్నరీ కళాశాలను కొడంగల్ కు తీసుకుపోయాడని, దేవున్ని రాజకీయాలకు వాడుకోవడం ఒక్క బీజేపీ కే దక్కుతుందన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ అంత భక్తుడు…
చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్మోహన్ రెడ్డి పని చేశారు.. సుమారు 2000 కోట్ల రూపాయలతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. గురజాల నియోజకవర్గంలో ఇంటింటికి కులాయి కార్యక్రమం 50 శాతం పూర్తి చేయగలిగాం.. మరొక 50 శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు అని పేర్కొన్నారు. పిడుగురాళ్ల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు, బైపాస్ నిర్మాణాలు చేశాం.. సంక్షేమ కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వం…
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకట్ రామి రెడ్డి, పటన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గణేశ్ గడ్డ బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన అడ్డ అని…
కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి డ్రాయర్ ఊడదీస్తా అంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు సీఎంవా చెడ్డి గ్యాంగ్ లీడర్‌వా రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
సిద్దిపేటకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని సిద్దిపేట యువతకు మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో సోమవారం జరిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) యువజన విభాగం సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేటకు మాజీ ముఖ్యమంత్రి మంజూరు చేసిన ప్రభుత్వ వెటర్నరీ కళాశాలను తీసుకోవడమే కాకుండా రూ.150 కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రద్దు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న…
Harsih Rao: బీజేపీ వాళ్ళు దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జహీరాబాద్ లో BRS పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ..
నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. జనజాతర పేరుతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. హాజరుకానున్న ఖర్గే, రాహుల్‌గాంధీ, రేవంత్, నేతలు. జాతీయ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్ గాంధీ. 10 లక్షల మంది జన సమీకరణకు కాంగ్రెస్ ప్రణాళిక. నేడు పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన. పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు. క్రోసూరు, సత్తేనపల్లి బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీమంత్రి హరీష్ రావు లేఖ రాశారు. మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి.. మళ్ళీ ప్రజలను మోసం చేయొద్దు అని సూచించారు. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలను గుప్పిస్తూ మేనిఫెస్టోలను విడుదల చేశారు.. రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో మీరే అధికారంలోకి వచ్చారు. కానీ అప్పుడు ఇచ్చిన హామీలు వేటిని అమలు చేయలేదని లేఖలో ప్రస్తావించారు. 2023లో కూడా తెలంగాణలో అనేక…