గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తుంది అని ఆరోపించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (ఎస్ఆర్ఎస్పీ)లో నీరు తగ్గిన కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశాం అన్నారు. ఇక, మేడిగడ్డలోని ఒక్క బ్లాక్ లో ఒక పిల్లర్ మాత్రమే కుంగితే మాపై బురద జల్లి అధికారంలోకి వచ్చారు అని హరీష్ రావు విమర్శించారు.
Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాల్లో తాను అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వివరాల విషయమై లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు (Unstarred Questions) ఇప్పటివరకు సమాధానాలు రాలేదని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ బిజినెస్ రూల్స్ 52(1) ప్రకారం, శాసనసభ్యులు అడిగిన నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలను సభా టేబుల్‌పై అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఉందని హరీశ్…
వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. "రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడు. కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదు. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట. వంద రోజుల్లో అమలు చేస్తామన్న…
అవసరమైతే రోబోలను పంపి.. రెస్క్యూ ఆపరేషన్ లో వాడుకునే దిశగా ప్రయత్నం చేయాలని సూచించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా సానుభూతి తెలపాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.. ఎస్ఎల్బీసీ టన్నెల్ పరీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 11 కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఈ విపత్తు లో పనిచేస్తున్నాయన్నారు. "ఇది ఒక ప్రమాదం.. ఇది విపత్తు.. అందరం కలిసి సానుభూతి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. హెలికాప్టర్ ఇచ్చి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. "బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం జరిగింది. సమయానికి రైతుబంధు తో పాటు సబ్సిడీలు అందజేసి నూనె గింజల పంటలను సాగు చేసేలా ప్రోత్సాహం కల్పించాం. సాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం. నాటి ప్రణాళికా బద్దంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నూనె పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు(సన్ ఫ్లవర్)…
సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు పాక్ నుంచి బెదిరింపులు.. పోలీసుల దర్యాప్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ముఖ్యమంత్రిపై దాడి చేయబోతున్నట్లు సందేశం యొక్క సారాంశం. ఈ బెదిరింపుపై ముంబైలోని వర్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరింపుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాట్సాప్‌లో తెలియని నంబర్ నుంచి ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. బెదిరింపు సందేశం…
గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా.. ఎస్ఎల్బీసీ పూర్తయేది అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. సొరంగం మార్గంకు టైం పడుతుందని, మొదట్లో లిఫ్ట్ అనుకున్నాం అని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ఎల్బీసీని వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలని చూస్తోందన్నారు. ప్రమాదాన్ని ప్రమాదం లాగ చూడాలని.. రాజకీయం చేయొద్దన్నారు. ఇంతకు ముందు పవర్ హౌజ్‌లో ప్రమాదం జరగలేదా?, కాళేశ్వరంలో జనాలు చనిపోలేదా? అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు ఇటీవల జైలు నుండి విడుదలైన ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీశ్ రావు, వంశీ కృష్ణ, సంతోష్ కుమార్, పర్శరాములుపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో ఏ-2గా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్…
ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అని హరీశ్ రావు అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేక పోయారన్నారు. హరీశ్ రావు సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడని ఎద్దేవా చేశారు. అడిగిన దానికి తప్ప.. అన్నిటికి హరీశ్ రావు స్పందిస్తారని విమర్శించారు. ప్రమాదం జరగగానే హరీష్ రావు ఎందుకు రాలేదు?…
విచారణకు సహకరించని పోసాని.. అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో లో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విచారణ కొనసాగుతుంది. దాదాపుగా ఐదు గంటల పాటు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సీఐ వెంకటేశ్వర్లు విచారిస్తున్నారు. అయితే, విచారణకు నటుడు పోసాని కృష్ణ మురళి సహకరించడం లేదు.. ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నారు.. ఆయన నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుంది అన్నారు.. అలాగే, తాము అడిగిన ప్రశ్నలకు పోసాని తికమక సమాధానం…