TG Assembly: సీఎం స్పీచ్‌ను వాక్ ఔట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్‌ను వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- తమ నాయకుడు కేసీఆర్ చావు కోరుకునే విధంగా సీఎం మాట్లాడారు
- కేసీఆర్‌ను మార్చురీకి పంపిస్తాం అన్నారు- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- అందుకే సీఎం స్పీచ్ ను బహిష్కరించాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. తమ నాయకుడు కేసీఆర్ చావు కోరుకునే విధంగా సీఎం మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్‌ను మార్చురీకి పంపిస్తాం అన్నారు.. అందుకే సీఎం స్పీచ్ ను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సందర్భంగా లాబీలో హరీష్ రావు మాట్లాడుతూ.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని అన్నారు. అందుకే సీఎం స్పీచ్‌ను బహిష్కరించామని హరీష్ రావు తెలిపారు.
Read Also: Kishan Reddy: త్రిభాషా పాలసీ కొత్తది కాదు.. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదు
Also Read
మరోవైపు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీష్ రావు పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి.. 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారని తెలిపారు. ప్రాజెక్టులు కట్టని కాంగ్రెస్ దే పాపం అని దుయ్యబట్టారు. రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ వెళ్లి ఎందుకు ఒప్పుకొని వచ్చారని ప్రశ్నించారు. పులిచింతల పోతిరెడ్డిపాడు కట్టినప్పుడు తాము కొట్లాడామని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: Kavitha: కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారు..
ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉండి.. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి పదవి సాధించారని హరీష్ రావు తెలిపారు. ఈ మధ్య ఉత్తమ్ కుమార్ దంపతులు చంద్రబాబును కలిసి భోజనం చేసి వచ్చారు.. ఆ తర్వాత శ్రీశైలం ఖాళీ చేసే లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్రోహం చేశారని ఆరోపించారు. మాది త్యాగ చరిత్ర అయితే.. ఉత్తమ్ కుమార్‌ది ద్రోహ చరిత్ర అని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహం వల్లనే ఈ రోజు పంటలు ఎండుతున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!