మొన్నటి దాకా దాదాపు కొన్ని నెలలుగా హుజురాబాద్ ఎలక్షన్‌తో బీజీ బీజీగా ఉన్న హరీష్ రావు శుక్రవారం సిద్ధిపేట పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.12 గంటలు 12 కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణు ల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. అటు ప్రజల మధ్య…ఇటు ప్రగతి కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపారు మంత్రి హరీష్. ” నాయకుడు అనే పదానికి కొత్త అర్థం చెప్పడంలో మంత్రి హరీష్ రావు తన కు తానే సాటి అని మరో సారి నిరూపించారు.
ఉదయం హైదరాబాద్ బయలు దేరిన మంత్రి దుబ్బాక నియోజ కవర్గంలోని తొగుట మండలం జెడ్పీటీసీ ఇంద్రసేనా రెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత మల్లన్న సాగర్ సందర్శించి గొప్ప ప్రాజెక్టు అని, అనతి కాలంలో పూర్తి చేసుకున్నామని స్థానిక ప్రజాప్రతినిధులతో పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. అనంతరం పొన్నాల పార్టీ కార్యాలయంలో జరిగిన సిద్ధిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో దాదాపు 2 గంటల పాటు కార్యకర్తలతో ఆత్మీయంగా గడిపారు. పార్టీ కమిటీలపై, 29నవరంగల్ లో జరిగే బహిరంగ సభ పై దిశానిర్దేశం చేశారు.అక్కడే కార్యకర్తలకు ఏర్పాటు చేసిన భోజనాన్ని తానే స్వయంగా వడ్డించి కార్యకర్తల్లో ఉత్సహం నింపారు.
తర్వాత సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో వైశ్య ప్రతినిధులతో, మిట్టపల్లి మహిళలతో, కుట్టు మిషన్‌ల పంపిణీ, సిద్ధిపేట ఆర్టీసీ డిపోలో నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పొరేషన్ కింద భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ కేంద్రం, బస్సు ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొ న్నారు. అనంతరం బాలికల పాఠశాలలో, జిల్లా కలెక్టరేట్‌లో పలు కార్యక్రమాల్లో దాదాపు శుక్రవారం రోజున 12 గంటల పాటు 12 కార్యక్ర మాల్లో ప్రజల మధ్యన , ప్రగతి కార్యక్రమాల్లో నిర్విరామంగా హరీష్‌రావు పాల్గొన్నారు. దాదాపు 5 నెలల తర్వాత సిద్ధిపేటకు వచ్చిన మంత్రి గారిని కలిసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. అటు కార్య కర్తలు, అభిమానులతో కార్యక్రమాలు అన్ని కోలాహలంగా జరిగాయి. ఎటు వెళ్లిన ప్రజలతో మమేకమైపోయి క్షణం తీరిక లేకుండా మంత్రి హరీష్ రావు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.