Funny Incident: ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లయిన వ్యక్తి, ‘‘ఫస్ట్ నైట్’’ రోజే అదృశ్యమవ్వడం సంచలనంగా మారింది. ఈ పరిణామం వరుడి కుటుంబీకులను ఆందోళనకు గురి చేసింది. వివాహం అయిన రోజే అదృశ్యం కావడంతో వారంతా భయపడిపోయారు. మొహిసిన్ అనే వ్యక్తికి 5 రోజుల క్రితం ముజఫర్ నగర్ లో వివాహం జరిగింది. పెళ్లి రాత్రి, అతడి భార్య గదిలో వేచి చూస్తూ ఉంది. అయితే, గది…
ఉత్తరాఖండ్‌లోని మున్సియారీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం తర్వాత కారణంగా హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ చేయబడింది.
ఉత్తరాఖండ్‌ను మరోసారి వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు కురవడంతో హరిద్వార్‌లో పెద్ద ఎత్తున ప్రవాహం ప్రవహించింది. దీంతో కార్లు, బస్సులు కొట్టుకుపోయాయి. శ్మశాన వాటికలో ఆగి ఉన్న బస్సులు, ఎనిమిది కార్లు కొట్టుకుపోయాయి.
గంగా దసరా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు హరిద్వార్‌కు చేరుకున్నారు. దీంతో మంగళూరులోని నర్సన్ సరిహద్దు నుంచి హరిద్వార్ వెళ్లే హైవేపై భారీ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ వ్యవస్థను సులభతరం చేసేందుకు రూర్కీలోని నాగ్లా ఇమర్తి నుంచి వాహనాలను లక్సర్ వైపు మళ్లించి హరిద్వార్‌కు పంపుతున్నారు. ఇన్నీ సహాయక చర్యలు చేపట్టినా.. హరిద్వార్‌లో రద్దీ తగ్గడం లేదు.
మనం ఏ గుడికైనా, ఏ ప్రార్థన మందిరానికి వెళ్లిన అక్కడ ఉన్న పూజారులు దేవుడికి పూజలు చేసి వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తారు. కాకపోతే., తాజాగా కొందరు భక్తులను గుడిలోని పూజారులు అలాగే ఆలయ సిబ్బంది కర్రలతో కొట్టిన సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంకా ఈ సంఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని సహరిన్ పూర్ కు చెందిన కొందరు వ్యక్తులు సిద్ధ బీట్ లోని దక్షిణ ఖాళీ మందిరం సందర్శానికి…
Haridwar: ఉత్తరాఖండ్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. బ్లడ్ క్యాన్సర్ నుంచి తన మేనల్లుడిని కాపాడాలని వెర్రితనం 4 ఏళ్ల బాలుడి ప్రాణాలను తీసింది. బాలుడు రవి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అయితే, గంగా నదిలో 5 నిమిషాల పాటు నీటిలో ముంచితే అద్భుతం జరుగుతుందని బాలుడి మేనత్త సుధ మూఢనమ్మకం పెట్టుకుంది. చివరకు బాలుడు మరణించడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నల్లని మేఘాలతో హరిద్వార్ చీకటిగా మారిపోయింది. అయితే ఈ వాతావరణ పరిస్థితిని షెల్ఫ క్లౌడ్ అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. షెల్ఫ్ క్లౌడ్ అనేది లోతట్టు, క్షితిజ సమాంతర మేఘాల నిర్మామని వెదర్ డిపార్ట్మెంట్ నిపుణులు తెలిపారు. హరిద్వార్ లో కమ్ముకొచ్చిన మేఘాలను కొందరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతోన్నాయి.
మైనర్‌తో సహా పలువురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ, దేశ రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఈరోజు తమ పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామని చెప్పారు.