దేవాదాయ శాఖ కమిషనరుగా బాధ్యతలు స్వీకరించారు హరి జవహర్ లాల్. దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు వంటి అంశాలపై ఉద్యోగులతో జవహర్ లాల్ సమీక్ష నిర్వహించారు. అందులో హరి జవహర్ లాల్ మాట్లాడుతూ.. దేవాలయాల్లో కైంకర్యాలు, పూజలు సంప్రదాయ బద్దంగా జరిగేలా చూస్తాం. ఆలయాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించే అంశంపై దృష్టి పెడతాం. ఆధ్యాత్మిక వాతావరణం ఆలయాల వద్ద కనిపించాలి. హిందూ సంప్రదాయాలను గౌరవించేలా, ఆచరించేలా ప్రోత్సహిస్తాం.…