Hardik Pandya Breaks Rohit Sharma Record As Captain: గాయం నుంచి కోలుకొని, టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా హవా కొనసాగుతోందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఒకవైపు ఆల్‌రౌండర్‌గా, మరోవైపు కెప్టెన్‌గా దూసుకెళ్లిపోతున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో అరంగేట్రంలోనే గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా టైటిల్ తెచ్చిపెట్టిన పాండ్యా.. భారత జట్టుని కూడా అంతే సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. వరుసగా విజయాల్ని అందిస్తున్నాడు. లేటెస్ట్‌గా శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ అతని సారథ్యంలో టీమిండియా గెలుపొందింది. ఈ నేపథ్యంలోనే అతడు కెప్టెన్‌గా తన పేరిట అరుదైన రికార్డ్ నమోదు చేసుకున్నాడు.
Delhi Car Horror: ఢిల్లీ యువతి కేసులో ట్విస్ట్‌లే ట్విస్టులు.. మరో ఇద్దరి ప్రమేయం ఉందట!
భారత కెప్టెన్‌గా తొలి ఆరు మ్యాచెస్‌లో 5 విజయాలు (న్యూజిలాండ్‌తో ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది) సాధించి, ఓటమి ఎరుగని కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఏ ఒక్క కెప్టెన్ కూడా ఈ ఘనత సాధించలేదు. ఇంతకుముందు రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు 6 మ్యాచెస్‌లో ఐదు విజయాలు సాధించింది. అయితే.. మధ్యలో 5వ మ్యాచ్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది. కానీ హార్దిక్ సారథ్యంలో భారత జట్టు ఓటమి చవిచూడలేదు. మధ్యలో ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసిందంతే! దీంతో.. రోహిత్ శర్మ రికార్డ్ బద్దలైంది. ఇంకా రెగ్యులర్ కెప్టెన్ కాకుండానే హార్దిక్ ఈ రికార్డ్‌ని తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఇలాగే భారత జట్టుని విజయపథంలో నడిపిస్తే.. హిట్‌మ్యాన్ సాధించిన వరుస విజయాల రికార్డుకి అతడు మరింత చేరువ అవుతాడు. మరి, తన జైత్రయాత్రని హార్దిక్ ఇలాగే కొనసాగిస్తాడా? లేదా? అన్నది చూడాలి.
Itchy Scalp: తల దురదగా ఉందా.. ఈ రెమిడీస్ మీ కోసమే!