Ms Dhoni: సినిమాల్లో చిరంజీవి, క్రికెటర్లో ధోని.. తగ్గేదిలేదు. ఎంతమంది స్టార్లు వచ్చినా చిరు స్థానం తగ్గదు.. అలాగే కుర్ర క్రికెటర్లు ఎంతమంది వచ్చినా తల క్రేజ్ పోదు. ధోని ఏది చేసినా సంచలనమే. ఇక తాజాగా ధోని కుర్ర క్రికెటర్లతో కలిసి చిందు వేశాడు. దుబాయ్ లో జరిగిన పార్టీలో హార్దిక్ పాండ్య, మరికొందరతో కలిసి ధోని డ్యాన్స్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సాంగ్స్ కు ధోని కాలు కదిపాడు. ఇక ఈ వీడియోను హార్దిక్ పాండ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ” అవర్ జామ్.. అవర్ మూవ్స్.. వాట్ ఏ నైట్” అంటూ రాసుకొచ్చాడు. ఇక వైట్ కలర్ షర్ట్ లో ధోని హీరోలా కనిపిస్తున్నాడు.
సాంగ్ కు తగ్గట్టు అలవోకగా శరీరాన్ని తిప్పుతూ మిస్టర్ కూల్ కెప్టెన్ ఇంకా కూల్ గా కనిపించాడు. ధోని లో ఈ యాంగిల్ చూడని అభిమానులు ఫిదా అవుతున్నారు. ధోని అన్నా నువ్వు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ధోని నిర్మాతగా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే ఒక ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మొట్టమొదటి సినిమా కోలీవుడ్ లో చేస్తున్నట్లు ధోని ప్రకటించాడు. మరి మిస్టర్ కూల్ కెప్టెన్.. మిస్టర్ కూల్ నిర్మాతగా కూడా మారతాడేమో చూడాలి.