Mumbai Indians Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు గుజరాత్ టైటాన్స్ రంగంలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో.. వాళ్లే ఫైనల్‌కి చేరుకుంటారు. ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడతారు. కాబట్టి.. ఈ ప్రతిష్టాత్మకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారా? అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. లీగ్ దశలో 10 విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన జీటీ జట్టు.. తొలి క్వాలిఫైయర్‌లో మాత్రం చెన్నై చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. లీగ్ దశలో 8 విజయాలతో ఎలిమినేటర్‌కు నెట్టుకొచ్చిన ముంబై ఇండియన్స్, ఆ మ్యాచ్‌లో లక్నోని మట్టికరిపించి క్వాలిఫైయర్-2కి చేరుకుంది.
Seediri Appalaraju: మత్య్సకారుల్ని చంద్రబాబు మోసం చేస్తే.. జగన్ వారికి పెద్ద పీట వేశారు
బలాబలాల పరంగా చూసుకుంటే.. ముంబై, గుజరాత్ జట్లు సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ పరంగా.. ఈ రెండు జట్లు పటిష్టంగానే ఉన్నాయి. కాకపోతే.. ముంబైలోనే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉందని చెప్పుకోవచ్చు. జీటీ స్థాయిలో పటిష్టంగా లేదు. అయితే.. గత కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రం ముంబై బౌలింగ్ మెరుగుపడింది. బ్యాటింగ్‌లో మాత్రం ఇరు జట్లలోనూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా.. గుజరాత్‌లో గిల్ వెన్నుముకగా నిలిచి తన జట్టుకి ముందుకు నడిపిస్తున్నాడు. ఇటు.. సూర్యకుమార్ యాదవ్ తన 360 డిగ్రీ ఆటతో ముంబైకి పరుగుల సమకూర్చడంలో సత్తా చాటుతున్నాడు. గ్రీన్ కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఇరు జట్లలోని కెప్టెన్లే పెద్దగా రాణించడం లేదు. ఈ సీజన్‌లో ఎప్పుడో ఒకసారి మెరిశారే తప్ప.. నిలకడగా రాణించలేదు. మరి.. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో వీళ్లు ఎలా రాణిస్తారో? ఏ జట్టు దేనిపై ఆధిపత్యం చెలాయిస్తుందో చూడాలి.
Samantha: నాగ చైతన్య ప్లేస్ ను అతనితో రీప్లేస్ చేస్తున్న సమంత..?