వైసీపీ నేతల వేధింపులతో ఓ కాంట్రాక్టు కార్మికుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా హలహర్వి మండలం అమృతపురంలో చోటుచేసుకుంది. వాటర్ మ్యాన్ కాంట్రాక్ట్ కార్మికుడు పరుశురాం సూసైడ్ చేసుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో హాలచల్ చేస్తోంది. ఆమృతపురం వైసీపీ నాయకులు తనపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగం నుంచి తీసేశారని కాంట్రాక్టు కార్మికుడు పరుశురాం ఆరోపించాడు.
ఆమృతపురం వైసీపీ నాయకులు గుమ్మునూరు నారాయణస్వామి, దిబ్బిలింగ, శేఖర్ కలిసి కాంట్రాక్ట్ కార్మికుడు పరుశురాంను ఇబ్బందులకు గురిచేశారు. వాటర్ మ్యాన్ పరుశురాంపై ఒత్తిడి తెచ్చి.. ఉద్యోగం నుంచి తొలగించారు. అంతేకాదు పరుశురాం భార్యను అంగన్వాడి ఆయా ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రయత్నించారు. తినడానికి తిండి లేక.. భార్య పిల్లల్ని ఎలా పోషించాలనే మనో వేదనతో పరుశురాం ఆత్మహత్యయత్నం చేశాడు.
Also Read: MS Dhoni Jersey: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఏడో నెంబర్ జెర్సీకి రిటైర్మెంట్!
వారం రోజులుగా మనోవేదన గురైన పరశురాం పురుగులు మందు తాగాడు. పరుశురాం సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీశాడు. ఆమృతపురం వైసీపీ నాయకులు తనపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగం నుంచి తీశేశారని.. తన భార్య ఉద్యోగాన్ని కూడా తీసేయడానికి ప్రయత్నిస్తున్నారని.. వైసీపీ నాయకులు గుమ్మునూరు నారాయణస్వామి, దిబ్బిలింగ తన చావుకు కారణమవుతారని తాను అనుకోలేదని సెల్ఫీ వీడియోలో పరుశురాం పేర్కొన్నాడు. స్థానికులు పరుశురాంను గమనించి బళ్లారి ఆస్పత్రికి తరలించారు.