Hanmakonda: వరకట్నం అడగడం, తీసుకోవడం నేరం.. ఇది అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నాం. వరకట్న దురాచారాన్ని రూపుమాపడానికి ఎంతోమంది సంఘసంస్కర్తలు ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేశారు. అయినప్పటికీ వరకట్నమనే జాడ్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వరకట్నం కోసం వేధింపులు, హత్యలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ వరకట్నం ఇచ్చి పెళ్లి చేసినా అదనపు కట్నం కోసం వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వేధింపులకు సంబంధించి కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. అయినా జనాల బుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also:Bhatti Vikramarka: ప్రభుత్వం మెడలు వంచి.. మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను
హన్మకొండ గోపాలపూర్లో అత్తింటి వారు వేధిస్తున్నారంటూ ఓ మహిళ తన భర్త ఇంటి ముందే టెంట్ వేసుకుని నిరసన వ్యక్తం చేస్తోంది. బాధితురాలి పేరు శ్రీదివ్య తనకు ఆడపిల్ల పుట్టిందని ఐదేళ్లు తనకు నరకం చూపిస్తున్నారని ఆమె వాపోయింది. అత్తామామల వేధింపుల కారణంగానే తన తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని కన్నీరు మున్నీరైంది. పుట్టింది ఆడపిల్ల కావడంతో అదనపు కట్నం తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టారని తెలిపింది. తనపై వేధింపులు అధికం చేసి.. తాను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి.. తను చనిపోయిన తర్వాత తన భర్తకు అధిక కట్నం తెచ్చే అమ్మాయితో మరో పెళ్లి చేయాలని చూస్తున్నట్లు ఆమె చెప్పింది.
Read Also:Hardik Pandya Note: చాలా కష్టంగా ఉంది.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం!
పోలీస్ లను పెద్దమనుషులను మేనేజ్ చేసుకొని విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయింది. తన భర్త పేరు కాశీ విశ్వనాథ్ అని.. అతడు ఇండియాన్ ఓవర్సీస్ బ్యాంక్ జనగామ బ్రాంచ్ మేనేజర్ అని.. ఇంట్లో ఉండడానికి వస్తే తన భర్త ఇంట్లో నుంచి మెడలు బట్టి బయటికి గెంటేశారని పేర్కొంది. తన తల్లి చనిపోవడంతో ప్రస్తుతానికి ఉండడానికి చోటు లేదని ఆవేదన చెందింది. తన బంధువులను.. కన్న బిడ్డ అన్న కనికరం కూడా లేకుండా బయటకు నెట్టేశారని తెలిపింది. మెట్టినింటి వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని.. దయ చేసి నన్ను నా పాపను కాపాడాలని వేడుకుంది.