(జూలై 14న తనికెళ్ళ భరణి పుట్టినరోజు)“ఆట కదరా శివా… ఆట కద కేశవా…” అంటూ ఈ తరం వారికి మరచిపోయిన మన సంప్రదాయంలోని మహాత్యాన్ని బోధిస్తున్నారు నటదర్శక రచయిత తనికెళ్ళ భరణి. ‘భూగోళమంతా ఓ నాటకరంగం… మనమంతా పాత్రధారులం…’ అన్నారు శాస్త్రకారులు. నిజమే! మనమంతా కనిపించని శక్తి చేతిలో ఆటబొమ్మలం. ఆ ఆట ఆడించేవాడు శివుడు అంటారు. ఆడించేది కేశవుడూ అనీ చెబుతారు. రచన, నటన రెండు కళ్ళుగా సాగుతున్న తనికెళ్ళ భరణి ఆడించేవారు ‘శివకేశవులు’ అంటూ…