(ఏప్రిల్ 17న హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు) కొన్ని ముఖాలు చూడగానే, పాపం పిల్లాడు అనిపిస్తాయి. అలా వయసుతో నిమిత్తం లేకుండా చాలా రోజులు పిల్లాడిలాగే కనిపించి మాయ చేశారు నవతరం కథానాయకుడు సిద్ధార్థ్. చదువు పూర్తి కాగానే సినిమాలపై ఆసక్తితో పరుగు తీసిన సిద్ధార్థ్ కు యాడ్ ఫిలిమ్ మేకర్ జయేంద్ర, సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ద్వారా మణిరత్నం వంటి దిగ్దర్శకుని వద్ద అసోసియేట్ గా పనిచేసే అవకాశం లభించింది. మణిరత్నం తెరకెక్కించిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’కు అలా అసోసియేట్…