Siddharth: చుక్కల్లో చంద్రుడు.. సిద్ధార్థ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddharth: వచ్చీ రాగానే వరుస విజయాలు చూసిన హీరోలలో చాలామంది ఎందుకనో ఆ పై అలరించలేకపోయారు. ఆ కోవకే చెందుతారు మన ‘చుక్కల్లో చంద్రుడు’ సిద్ధార్థ్! ఆయన నటించిన అనేక చిత్రాల్లో ‘చుక్కల్లో చంద్రుడు’గానే సిద్ధార్థ్ ను పోల్చడానికి ఓ కారణముంది. చక్కని చుక్కల కోసం పచ్చని కాపురాన్ని వదలుకున్న ఘనుడు సిద్ధార్థ్. ప్రస్తుతం ఆయనతో ఉన్న చుక్క ఎవరంటే – ‘సమ్మోహనం’ నాయిక అదితీరావ్ హైదరీ!నీకూ నీ వారు లేరు… నాకూ నా వారు లేరు… చల్ మోహనరంగా – అంటూ సిద్ధార్థ్, అదితీ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. మరి ఈ చుక్కకు చిక్కిన చక్కనయ్య సినిమాలేమీ చేయడం లేదా? అంటే కమల్ హాసన్ ‘భారతీయుడు-2’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు సిద్ధార్థ్. అంతకు మించి కమిట్ మెంట్స్ ఏమీ లేనట్టే కనిపిస్తున్నా, వార్తల్లో మాత్రం ఏదో విధంగా నానుతూనే ఉన్నారు సిద్!
సిద్ధార్థ్ కు సినిమా అంటే ప్యాషన్! చదువు పూర్తి కాగానే సినిమాలపై ఆసక్తితో పరుగు తీసిన సిద్ధార్థ్ కు యాడ్ ఫిలిమ్ మేకర్ జయేంద్ర, సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ద్వారా మణిరత్నం వంటి దిగ్దర్శకుని వద్ద అసోసియేట్ గా పనిచేసే అవకాశం లభించింది. మణిరత్నం తెరకెక్కించిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’కు అలా అసోసియేట్ గా చేశారు సిద్ధార్థ్. అదే చిత్రం తెలుగులో ‘అమృత’ పేరుతో అనువాదమయింది. ఆ మూవీలో ఓ సీన్ లో తళుక్కున మెరిసిన సిద్ధార్థ్ లోని నటుణ్ణి గుర్తించారు రచయిత సుజాత. ఆయన ప్రోత్సాహంతోనే శంకర్ తన ‘బోయ్స్’ లో సిద్ధార్థ్ ను హీరోగా ఎంచుకున్నారు. ఆ చిత్రం తరువాత నటనపైకి ధ్యాస మళ్ళించారు సిద్ధార్థ్. మణిరత్నం రూపొందించిన ‘యువ’లోనూ కీలక పాత్ర ధరించిన సిద్ధార్థ్ ను తెలుగు నిర్మాత ఎమ్మెస్ రాజు తన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తో తెలుగువారికి పరిచయం చేశారు. ఈ చిత్రంతోనే నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవా దర్శకునిగా మారారు. ఈ సినిమా సాధించిన ఘనవిజయంతో సిద్ధార్థ్ కు తెలుగునాట విశేషాదరణ లభించింది. ఇలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చిన సిద్ధార్థ్ తెలుగు, తమిళ చిత్రాలలోనే కాదు హిందీలోనూ సిద్ధార్థ్ తనదైన బాణీ పలికించారు.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
సిద్ధార్థ్ లోని నటుడు, ప్రముఖ హిందీ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రాకు
కూడా భలేగా నచ్చాడు.దాంతో తాను తెరకెక్కించిన ‘రంగ్ దే బసంతీ’లో కీలకమైన భగత్ సింగ్ పాత్రను ఇచ్చారు. అందులో హీరోగా నటించిన ఆమిర్ ఖాన్ సైతం సిద్ధార్థ్ ను ఎంతగానో ప్రోత్సహించారు. తెలుగు చిత్రాల ఆదరణతో సిద్ధార్థ్ దృష్టి ఇక్కడే కేంద్రీకరించారు.”చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, ఓయ్, అనగనగా ఓ ధీరుడు, బావ, ఓ మై ఫ్రెండ్, జబర్దస్త్” వంటి తెలుగు చిత్రాల్లో నటించిన సిద్ధార్థ్ ‘బాద్ షా’లో యన్టీఆర్ ఫ్రెండ్ గా కనిపించారు. నటునిగా, గాయకునిగా, నిర్మాతగా, రచయితగా తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. తెలుగులో ఆదరణ తగ్గిపోగానే, తమిళ బాట పట్టారు సిద్ధార్థ్. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయారు. ‘మహాసముద్రం’ అనే ద్విభాషా చిత్రంలో శర్వానంద్ తో కలసి నటించారు సిద్ధార్థ్. మళ్ళీ ఏ తీరున సిద్ధార్థ్ అలరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!