(జూలై 28న కృష్ణవంశీ పుట్టినరోజు)మెగాఫోన్ పట్టిన కొద్ది రోజులకే ‘క్రియేటివ్ డైరెక్టర్’ అన్న మాటను పేరు ముందు చేర్చుకోగలిగారు కృష్ణవంశీ. ‘థింక్ ఔటాఫ్ ద బాక్స్’ అన్న రీతిలో కృష్ణవంశీ సాగుతూ ఉంటారు. పాత కథనైనా కొత్తగా చెప్పాలని తపిస్తారు- అదే కృష్ణవంశీ ప్రత్యేకత. ఆయన కెరీర్ లో సక్సెస్ రేట్ అంతగా లేకున్నా, తన ప్రతి చిత్రంలో వైవిధ్యం ప్రదర్శించాలనే భావిస్తారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ‘రంగమార్తండ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. కృష్ణవంశీ…