Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళలకు దగ్గరైన ఈ హీరో ప్రస్తుతం విలన్ గా, సపోర్టివ్ రోల్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే జగపతిబాబు ఉండడం కామన్ గా మారిపోయింది. మొదటి నుంచి కూడా జగపతిబాబుకి ముక్కు సూటితనం ఎక్కువ.