కట్టుకున్న భర్తను భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు కలిసి అతి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బీడీ కాలనీ లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తి 36 సంవత్సరాల కాసాల బ్రహ్మయ్య చారిగా గుర్తించారు. కాసాల బ్రహ్మయ్య చారిని హత్యచేసింది భార్య నందిని, మామ దత్తాత్రేయ, అత్త గంగామణిలుగా పోలీసులు గుర్తించారు. రూరల్ సీఐ శ్రీనివాస్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందచేశారు. బీబీపేట మండల కేంద్రానికి చెందిన…
సౌదీ అరేబియాలో సాధారణంగా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తప్పు చేశారని నిరూపణ అయితే గుండు చేయడం, కాళ్లు, చేతులు తీసేయడం వంటివి ఆ దేశంలో చేస్తుంటారు. ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో సౌదీ ఆరేబియా అగ్రస్థానంలో ఉందంటే అక్కడి ప్రభుత్వం నేరస్తుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రికార్డు స్థాయిలో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసింది.…
మాదాపూర్ విఠల్‌రావు నగర్ లోని అలియన్స్ బ్లెండెడ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఆన్గ్మీట్ లెప్చా (39) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. బ్యూటీషన్ గా పనిచేస్తున్న లెప్చా తాను ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి స్వస్థలం డార్జిలింగ్.. ఇద్దరు పిల్లలు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. భర్త తో ఉన్న విభేదాల తోనే మనస్థాపానికి గరై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు…
కామారెడ్డిలో ఓ వివాహత అనుమానస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిప్రసాద్, శిరీష(32)లు దంపతులు. బెంగూళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో వీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గత కొంతకాలంగా ఇంటినుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం శిరీష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని భర్త హరిప్రసాద్ శిరీష తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్న శిరీష తల్లిదండ్రులు హరిప్రసాదే శిరీషను హత్యచేసి ఆత్మహత్యగా…
రోజురోజుకు ప్రజల మానసిక స్థితి ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే ఇది.. హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీకి చెందిన ఓ మహిళ తన తండ్రి మందలించడంతో ఉసురుతీసుకుంది. మమత అనే మహిళ తన తల్లిదండ్రులతో కేపీహెచ్ బీ కాలనీలో నివాసం ఉంటోంది. మమత కు 2019 వివాహం జరిగింది. అయితే భర్తకు కాన్సర్ ఉందని తెలియడంతో రెండు నెలలకే విడాకులు…