విజయవాడలో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో ఆప్కో ఎగ్జిబిషన్ షోరూంను పర్యాటక శాఖ మంత్రి రోజా గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆప్కో షోరూంలో వస్త్రాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమ్మర్ శారీ మేళాకు తనను పిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలకు నచ్చేలా అన్నీ ఆప్కో షోరూంలలో ఉన్నాయన్నారు. ప్రజలు కూడా ఆప్కో షోరూంలలో కొనుగోలు చేస్తూ ఆప్కో అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. చేనేత కార్మికులకు మనం సహాయం చేస్తేనే వాళ్లు అభివృద్ధి…