ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిరంతరం గాజాపై బాంబు దాడులు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. వెస్ట్ బ్యాంక్ నగరంలోని అరూరాలోని సీనియర్ హమాస్ అగ్రనాయకుడు సలేహ్ అల్-అరౌరీ ఇంటిని కూల్చివేసింది. . ఈ నాయకుడి పేరు సలేహ్ అల్-అరూరి. అతను హమాస్ పొలిటికల్ బ్యూరో డిప్యూటీ చీఫ్, వెస్ట్ బ్యాంక్‌లో హమాస్ మిలిటరీ కమాండ్ నాయకుడు.
Kerala Blast: కేరళ వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. మొత్తం 45 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Israel-Hamas War: హమాస్ ఇజ్రాయిల్ మధ్య మోగిన యుద్ధ బేరి 21 రోజులు గడిచిన ఇంకా వినపడుతూనే ఉంది. హమాస్ చేసిన ఆకస్మిక దాడిలో ఇజ్రాయిల్లో 1400 మంది పైగా ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపధ్యంలో ఇజ్రాయిల్ హమాస్ పైన ప్రతీకార దాడికి పూనుకుంది. ఇజ్రాయిల్ గాజా పైన చేసిన ప్రతీకార దాడుల్లో 7200 మందికి పైగా చనిపోయారు. ఇప్పటికి ఇజ్రాయిల్ గాజా పైన తన ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. అయితే హమాస్ ను నాశనం…
Israel Hamas War: గత మూడు వారాలుగా ఇజ్రాయెల్, హమాస్‌లు పరస్పరం బాంబు దాడులు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో మృతుల సంఖ్య 9000 దాటింది. ఈ యుద్ధం రెండవ దశ ప్రారంభమైందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
Israel-Hamas War: హమాస్ ఉగ్రవాదులు తమపై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటోంది ఇజ్రాయిల్. ఒక్కొక్కరిగా హమాస్ మిలిటెంట్లను, వారి కీలక నాయకులను హతమారుస్తోంది. తాజాగా మరోసారి హమాస్‌ని దెబ్బకొట్టింది ఇజ్రాయిల్. తాజాగా హమాస్ నౌకాదళ కమాండర్ రలేబ్ అబూ సాహిబాన్ ను లక్ష్యంగా చేసుకుని రాత్రిపూట ఇజ్రాయిల్ వైమానిక దాడుల చేసింది. ఈ దాడుల్లో అతన్ని చంపినట్లు శనివారం ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రకటించింది.
Turkey: టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మరోసారి పాలస్తీనా, హమాస్ పక్షానికి మద్దతుగా నిలిచారు. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనా భూభాగంపై దాడులను తీవ్రతరం చేసిన తర్వాత.. ఈ దాడులకు స్వస్తి చెప్పాలని ఎర్డోగాన్ శనివారం ఇజ్రాయిల్ ని కోరారు. ఇజ్రాయిల్ ‘‘తక్షణమే ఈ పిచ్చిని ఆపేయాలి’’ అని పిలుపునిచ్చాడు. గత రాత్రి గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు తీవ్రమయ్యాయి. మరోసారి మహిళలు, పిల్లలు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయి, కొనసాగుతన్న మానవత సంక్షోభాన్ని మరింత దిగజార్చాయి అని…
Priyanka Gandhi: ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి పిలుపునిస్తూ శనివారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ)లో పలు దేశాలు కలిసి తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. గాజా స్ట్రిప్కి సాయం అందించడానికి, పౌరులకు రక్షణ కల్పించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ఈ తీర్మానంపై ఓటింగ్ కి భారతదేశం దూరంగా ఉంది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై నేను సిగ్గుపడుతున్నా అని అన్నారు.
Kerala: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై భారత్ లో విభిన్న వాదనలతో ప్రజలు ఉన్నారు. అయితే కొంత మంది ఇజ్రాయిల్ కి మద్దతుగా, మరికొంత మంది పాలస్తీనాకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దేశంలోని పలు చోట్ల పాలస్తీనాకు సంఘీభావంగా ర్యాలీలు జరిగాయి. కేరళలోని మలప్పురంలో పాలస్తీనా మద్దతు ర్యాలీ వివాదాస్పదమైంది.
USA: ఇరాన్ లోని హమాస్ అధికారి, ఇరాన్ లోని రివల్యూషనరీ గార్డ్ సభ్యులతో సహా ఇటీవల ఇజ్రాయిల్ పై దాడికి తెగబడిన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌పై అమెరికా రెండో రౌండ్ ఆంక్షలు విధించింది.
Israel Palestine Attack: ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు విధ్వంసకరంగా మారుతోంది. గత 20 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు 6500 మందికి పైగా మరణించినట్లు సమాచారం.