PM Benjamin Netanyahu: అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు, మహిళా సంఘాలు, ఐక్యరాజ్యసమితిపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ మహిళలపై హమాస్ చేస్తున్న అత్యాచారాలు, దురాగతాలపై మాట్లాడటంతో ఇవన్నీ విఫలమయ్యాయని బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇజ్రాయిల్ మహిళలపై అత్యాచారారాలు, భయంకరమైన అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు’’ అని ఎక్స్(ట్విట్టర్)ద్వారా ప్రశ్నించారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ సంధి తర్వాత గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిలీ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లు ఉత్తర గాజాకే పరిమితమైన యుద్ధా్న్ని, దక్షిణంలోని సురక్షిత ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. హమాస్ ఉగ్రసంస్థను లేకుండా చేసేందుకు ఇజ్రాయిల్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. ఆ దేశ స్పై ఏజెన్సీ మొసాద్‌కి హమాస్ కీలక నేతలను హతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ సంధి ముగియడంతో మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో వారం రోజుల పాటు కొనసాగిన కాల్పుల విరమణ, బందీలు-ఖైదీల మార్పిడి నిలిచిపోయింది. సంధిని పొడగించాలని ప్రపంచదేశాలు పిలుపునిచ్చినప్పటికీ.. ఇజ్రాయిల్ పునరుద్ధరించడానికి సిద్ధంగా లేదు. దీంతో గాజాపై ఇజ్రాయిల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. గాజా స్ట్రిప్‌పై శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 240 మంది మరణించినట్లు హమాస్ తెలిపింది.
Israel-Hamas: హమాస్ దాడి తర్వాత ఆ సంస్థను పూర్తిగా అంతం చేసేందుకు ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు పావులు కదుపుతున్నారు. మాజీ ప్రధాని గోల్డా మీర్ అడుగుజాడల్లో నడవాలని అనుకుంటున్నారు. ఇజ్రాయిల్ తన శత్రువులను చంపేందుకు ‘ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్’ లాంటి మిషన్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే హమాస్ కీలక నేతల్ని చంపేందుకు నెతన్యాహు ఇజ్రాయిలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘మొసాద్’ని ఆదేశించారు. ప్రస్తుతం హమాస్ కీలక నాయకత్వం…
Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందాన్ని మరో 4 రోజులు పొడగించేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ నుంచి పాలస్తీనా ఖైదీలను, హమాస్ నుంచి ఇజ్రాయిలీ బందీలను విడుదల చేయడానికి మార్గం సుగమమైంది. సంధి పొడగింపుపై మధ్యవర్తులు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు వారాల యుద్ధం తర్వాత గత శుక్రవారం నుంచి సంధి అమలులోకి వచ్చింది. ప్రస్తుతం సంధి గురువారంతో ముగుస్తుంది. ఈనేపథ్యంలోనే మరింత కాలం సంధిని పొడగించాలని హమాస్, ఇజ్రాయిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Elon Musk: టెస్లా అధినేత, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి అరుదైన ఆహ్వానం అందింది. హమాస్ ఉగ్రసంస్థ మస్క్‌ని గాజా సందర్శించాల్సిందిగా ఆహ్వానించింది. ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయిల్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఈ పర్యటన తర్వాత గాజాను సందర్శించాలని హమాస్ సీనియర్ అధికారి మంగళవారం మస్క్‌కి ఆహ్వానం పలికారు.
Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ హమాస్ దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్లో ఎలాన్ మస్క్ భేటీ అయిన సందర్భంలో ఈయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్, గాజాలో కలిపి 16,000 మందికి పైగా మరణాలకు కారణమైన ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం పరిణామాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో హమాస్ ఉగ్రవాదులను హతమార్చడం తప్ప వేరే మార్గం లేదని ఎలాన్ మస్క్ అన్నారు.
Israel-Hamas war: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత రెండు నెలలుగా బందీలుగా ఉన్నవారిలో 25 మందిని హమాస్ ఉగ్రవాదులు విడుదల చేశారు. విడుదలైన వారిలో 12 మంది థాయ్‌లాండ్ దేశస్తులు ఉన్నట్లు ఆ దేశ ప్రధాని స్ట్రెట్టా థావిసిస్ పేర్కొన్నారు. నాలుగు రోజలు కాల్పుల విరమణలో భాగంగా హమాస్, ఇజ్రాయిల్ సంధి ఒప్పందానికి వచ్చాయి. మరోవైపు జైళ్లలో ఉన్న 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయిల్ విడుదల చేయనుంది.