Turky : గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌పై టర్కీ పెద్ద చర్య తీసుకుంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్‌కు చెందిన 33 మంది గూఢచారి ఏజెంట్లను టర్కీలో అరెస్టు చేశారు. మొసాద్‌కు సహాయం చేస్తున్నారనే అనుమానంతో వీరంతా టర్కీలో పట్టుబడ్డారు.
Israel-Hamas War: అక్టోబర్ 7 నాడు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో 1200 మందిని చంపడమే కాకుండా.. 240 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్లారు. అయితే ఇటీవల ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కొన్ని రోజుల పాటు ఇజ్రాయిల్, హమాస్ మధ్య సంధి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో కొంతమంది బందీలను హమాస్ విడిచిపెట్టగా.. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ తన జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హమాస్ ఉగ్రసంస్థను నేలమట్టం చేసేదాకా యుద్ధాన్ని ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రపంచదేశాల నుంచి వస్తున్న ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా హమాస్‌పై పోరుసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే గాజాలోని హమాస్ కీలక టన్నెల్ వ్యవస్థనున కుప్పకూల్చేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆ టన్నెల్స్‌ని సముద్ర నీరుతో ముంచేయాలని ప్లాన్ చేసింది.
Ivanka Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఇజ్రాయిల్‌ని సందర్శించనున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి చేసింది. ఈ దాడిలో బాధితులను ఇవాంకా ట్రంప్ కలుసుకున్నారు. భర్త జారెడ్ కుష్నర్‌తో కలిసి బాధితులను పరామర్శించారు.
Israel-Hamas: ఇజ్రాయిల్-గాజా యుద్ధంలో అమెరికా ఇజ్రాయిల్ పక్షాన నిలబడింది. అయితే యూఎస్‌లో జరిగిన ఓ పోల్ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా యంగ్ అమెరికన్లు హమాస్‌కి మద్దతుగా నిలుస్తు్న్నట్లు తేలింది. చాలా మంది యువ అమెరికన్ పౌరులు ఇజ్రాయిల్ ఉనికి కోల్పోవాలని, గాజాను నియంత్రిస్తున్న హమాస్‌కే అప్పగించాలనే అభిప్రాయాలను వెల్లడించినట్లుగా పోల్‌లో తేలింది.
Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ విమానాలు హమాస్ నియంత్రణలో ఉన్న గాజా స్ట్రిప్‌పై నిరంతరం బాంబు దాడులు చేస్తున్నాయి.
Hamas War: హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తమ లక్ష్యాలు నెరవేరే దాకా యుద్ధాన్ని ఆపేది లేదని, ఎంత ఒత్తిడి ఎదురైనా కూడా యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇటీవల చెప్పారు. దానికి అనుగుణంగానే ఇజ్రాయిల, గాజస్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. దీంతో పాటు వెస్ట్ బ్యాంకులో కూడా దాడులు నిర్వహిస్తోంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేసింది. మరో 240 మందిని బందీలుగా పట్టుకుంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు పక్షాలు సంధి ఒప్పందానికి రావడంతో కొందరు బందీలను హమాస్ రిలీజ్ చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. గత వారం ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ముగియడంతో మరోసారి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది.
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మళ్లీ మొదలైంది. ఇన్నాళ్లు ఉత్తరప్రాంతానికే పరిమితమైన యుద్ధం, ఇప్పుడు దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ యుద్ధంలో, హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియే పాకిస్తాన్ మద్దతు కోరారు. పాకిస్తాన్ దేశాన్ని ధైర్యవంతుడిగా కొనియాడుతూ.. ఇజ్రాయిల్ పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటే, ఆ దేశ క్రూరత్వం ఆడిపోతుందని చెప్పినట్లు ఆ దేశ జియో న్యూ్స్ బుధవారం నివేదించింది.