Israel: గాజా దక్షిణ ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పాక్షికంగా తన దళాలను ఉపసంహరించుకుంది. ఖాన్ యూనిస్ నగరం నుంచి ఇజ్రాయిల్ కొంత మంది సైనికులను బయటకు తీసుకువస్తున్నట్లు మిలిటరీ అధికారులు ఆదివారం తెలిపారు.
Gaza Crisis : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ గాజాకు వెళ్లేందుకు వేచి ఉన్న ట్రక్కుల పొడవైన లైన్ దగ్గర నిలబడి ఒక ప్రకటన చేశారు. శనివారం జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ.. సరిహద్దులో ఓ వైపు లారీలు నిలిచిపోయాయని, మరో వైపు దేశ ప్రజలంతా పస్తులు ఉండాల్సి వచ్చిందన్నారు.
Gaza War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరాటం భీకరం సాగుతోంది. అక్టోబర్ 7 నాటి దాడి తర్వాత హమాస్‌కి కేంద్రంగా ఉన్న పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడుతోంది. తాజాగా హమాస్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తున్న అల్-షిఫా ఆస్పత్రిడిపై ఇజ్రాయిల్ బలగాలు దాడి చేశాయి. ఈ దాడిలో 20 మంది హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారు. చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.
India: ఇజ్రాయిల్-హమాస్ పోరు నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయులకు మంగళవారం కీలక సూచనలను జారీ చేసింది. క్షిపణి దాడిలో భారతీయులు మరణించిన తర్వాత, ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘‘ ప్రస్తుతం భద్రతా పరిస్థితులు, స్థానిక భద్రతా సలహాల దృష్ట్యా దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే, సందర్శించే వారు ఇజ్రాయిల్ లోని సురక్షిత ప్రాంతాలకు మకాం మార్చాలని సూచించారు. రాయబార కార్యాలయం వారితో టచ్‌లో ఉంది. ఇజ్రాయిల్ అధికారులు మా పౌరులందరికీ భద్రత కల్పించాలి’’…
Israel: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, పాలస్తీనా భూభాగాలైన వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లపై తీవ్రంగా దాడులు చేస్తోంది. హమాస్-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇప్పటికే 28,700 మందికి పైగా మరణించారు. మరోవైపు యుద్ధం నిలిపేయాలని ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నటప్పటికీ.. హమాస్‌ని పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ పలుమార్లు స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్-హమాస్‌ల (israel hamas) మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న యుద్ధంతో రక్తపుటేరులు పారుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకొందరు చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నారు.
పశ్చిమాసియా మరోసారి నివురుగప్పిన నిప్పులా మారింది. అమెరికా జరిగిస్తున్న బాంబుల దాడితో దద్దరిల్లుతోంది. దీంతో గత కొద్దిరోజులుగా రక్తపుటేరులు పారుతున్నాయి.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు మరోసారి సంధికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పారిస్ వేదికగా ఈజిప్ట్, ఖతార్, ఇజ్రాయి్ల ఉన్నతాధికారులు భేటీ అయినట్లు సమచారం. ఈ యుద్ధం వల్ల ప్రపంచశాంతికి భంగం కలుగుతోందని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పలు వెస్ట్రన్ దేశాలు యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయిల్‌ని కోరుతున్నాయి. మరోవైపు హమాస్ పూర్తిగా అంతమయ్యే వరకు యుద్ధాన్ని విరమించే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని…