Israel: ఇజ్రాయిల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు పలువురు ఇజ్రాయిల్ పౌరులను, ఇతర దేశస్తులను బందీలుగా చేసుకున్నారు. ఇదిలా ఉంటే వీరిని రక్షించేందుకు ఇజ్రాయిల్ సిద్ధమవుతున్నట్లు బ్రిటీష్ పత్రికి ది టెలిగ్రాఫ్ నివేదించింది. దాదాపుగా 100 మంది పౌరులు హమాస్ ఉగ్రవాదులు చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రపంచంలో అతిశక్తివంతమైన, ఇజ్రాయిల్ ప్రత్యేక ఆపరేషన్స్ దళం సయెరెట్ మత్కల్ సిద్ధమైనట్లు సమాచారం.
Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ తీవ్రవాదులు శనివారం భీకరదాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడుతోంది. గాజాలోని ప్రముఖ భవనాలను బాంబులతో కుప్పకూలుస్తోంది. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి, హమాస్ మిలిటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డయిఫ్ ఇంటిని టార్గెట్ చేసింది ఇజ్రాయిల్. ఈ దాడిలో డయిఫ్ కుటుంబ సభ్యులు మరణించినట్లుగా హమాస్ ధృవీకరించింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇరు వైపుల మరణాల సంఖ్య 3000ను దాటింది.
Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరు పక్షాలు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటున్నాయి. ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. యుద్ధాన్ని హమాస్ మొదలుపెట్టింది, మేము ముగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హమాస్ ఉగ్రసంస్థను నెతన్యాహు ఐసిస్‌తో పోల్చారు. మేము యుద్ధాన్ని కోరుకేలేదు,
Donald Trump: అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయిల్ పై హమాస్ తీవ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. 5000 రాకెట్లతో గాజా నుంచి ఇజ్రాయిల్ పైకి దాడి చేశారు. ఈ దాడిలో 300 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. ఊహించని దాడితో ఇజ్రాయిల్ ఉక్కిరిబిక్కిరి అయింది. ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్ పై భీకరంగా దాడులు చేస్తోంది. చుట్టు పక్కల దేశాల్లోని మిలిటెంట్ సంస్థలు కూడా ఇజ్రాయిల్ పై దాడులకు చేస్తున్నాయి. ఈ చర్యలతో మరోసారి మధ్యప్రాచ్యంలో తీవ్ర…
Israel-Hamas War: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాజా నుంచి హమాస్ మిలిటంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేయడంతో ఇరువర్గాల మధ్య యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ రోజు అత్యవసరంగా సమావేశం కాబోతోంది. మిడిల్ ఈస్ట్ పరిస్థితుల గురించి క్లోజ్డ్ డోర్ సెషన్ నిర్వహించబోతోందని యూఎన్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇజ్రాయిల్‌పై హమాస్ దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయిల్ యుద్ధంలో ఉందని ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ అన్నారు.
Hamas Attack On Israel: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్లు ప్రయోగించారు. దాదాపుగా 14 ప్రాంతాల నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొచ్చుకువచ్చారు. పౌరులతో పాటు సైనికులను బందీలుగా తీసుకున్నారు. బందీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇజ్రాయిల్ మహిళా సైనికురాలిని చంపి నగ్నంగా ఊరేగించడం, సైనికుడిని కాల్చి చంపిన వీడియోలు బయటకు వచ్చాయి.
Air India: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి యుద్ధంగా మారింది. ఇజ్రాయిల్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇప్పటి వరకు 40 మంది ఇజ్రాయిలీలు మరణించారు. చాలా మందిని హమాస్ బందీలుగా పట్టుకున్నట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులతో హమాస్ స్థావరాలను టార్గెట్ చేస్తోంది. తాము యుద్ధంలో ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ప్రకటించారు.
Israel: పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై మెరుపుదాడి చేశారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లతో ఇజ్రాయిల్ భూభాగాలపై దాడులు నిర్వహించారు. సరిహద్దుల్లోనే పట్టణాలను టార్గెట్ చేస్తూ దాడులు జరిగాయి. గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగాల్లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు సాధారణ పౌరులను పిట్టల్లా కాల్చారు.
Hamas Attack On Israel: ఇజ్రాయిల్‌పై పాలస్తీనా గాజా నుంచి హమాస్ తీవ్రవాదులు భీకరదాడులు చేశారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయిల్ నగరాలు, పట్టణాలపై ప్రయోగించారు. ఇజ్రాయిల్ భూభాగంలోకి వెళ్లిన హమాస్ తీవ్రవాదులు అక్కడి సాధారణ పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. పలువురు ఇజ్రాయిల్ జాతీయులను బందీలుగా పట్టుకున్నారు.
Israel: పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పై భీకరదాడికి తెగబడింది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఇజ్రాయిల్ పౌరులను కాల్చి చంపారు. పలువురిని మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం గాజాపై ఎదురుదాడికి దిగింది. మిలిటెంట్లు, వారి స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది