Israel-Hamas War: ఇజ్రాయిల్‌పై హమాస్ తీవ్రవాదులు శనివారం భీకరదాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడుతోంది. గాజాలోని ప్రముఖ భవనాలను బాంబులతో కుప్పకూలుస్తోంది. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి, హమాస్ మిలిటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డయిఫ్ ఇంటిని టార్గెట్ చేసింది ఇజ్రాయిల్. ఈ దాడిలో డయిఫ్ కుటుంబ సభ్యులు మరణించినట్లుగా హమాస్ ధృవీకరించింది. ఇప్పటి వరకు ఇరు వైపుల మరణాల సంఖ్య 3000ను దాటింది.
Read Also: Himanta Biswa Sarma: పాకిస్తాన్, తాలిబాన్‌ల తరహాలోనే కాంగ్రెస్ పార్టీ.. హమాస్ తీర్మానంపై ఆగ్రహం..
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ మూడు వైపుల నుంచి ముప్పును ఎదుర్కొంటోంది. గాజా నుంచి ఇప్పటికే హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయిల్ పోరాడుతుంటే, ఉత్తరం నుంచి లెబనాన్, తూర్పు నుంచి సిరియా నుంచి పలు మిలిటెంట్ సంస్థలు హమాస్ కి మద్దతుగా పోరాటం కొనసాగిస్తున్నాయి. దీంతో ముప్పేల ముప్పుపై ఐడీఎఫ్ బలగాలు పోరాడుతున్నాయి.
సిరియా వైపు నుంచి గోలన్ హైట్స్‌పైకి సిరియా దాడులు చేసింది. బుధవారం ఈ దాడుల్ని తిప్పికొట్టినట్లు ఇజ్రాయిల్ సైన్యం చెప్పింది. 1967లో ఇజ్రాయిల్ ఈ గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. మరోవైపు లెబనాన్ నుంచి హమాస్ మద్దతుదారులైన హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. హమాస్ దాడులు మొదలైన తర్వాత తొలిరోజే హిజ్బుల్లా ఇజ్రాయిల్ పై దాడులు చేస్తోంది. తాజాగా లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పోస్టులపై దాుడలు జరిగాయి. మిలిటెంట్ గ్రూప్ యాంటీ ట్యాంక్ క్షిపణిని పేల్చేసింది. ఇలా మూడు వైపుల నుంచి ఇజ్రాయిల్ పోరాడుతోంది.