Israel: పాలస్తీనా గాజా స్ట్రిప్ నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై మెరుపుదాడి చేశారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయిల్ భూభాగంపైకి 5000 రాకెట్ల్ ప్రయోగించారు. ఈ దాడుల్లో 50 మంది దాకా మరణించగా.. 30 మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. గాజా ప్రాంతంలో ఇజ్రాయిల్ పౌరులపై మిలిటెంట్లు తుపాకులతో కాల్పులు జరిపారు. ఇజ్రాయిల్ పట్టణాల్లో స్వైర విహారం చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.
Israel-Gaza Conflict: గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించారు. ఇది యుద్ధ పరిస్థితిని సృష్టించింది.