H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు H-1B వీసా విధానంపై అనేక కొత్త నిబంధనలు తీసుకువస్తున్నాడు. H-1B వీసాల ద్వారా విదేశీయులు, అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అమెరికాలో విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశీ ఉద్యోగులను నియమించుకునే యూఎస్ కంపెనీలు ప్రభుత్వానికి 1,00,000 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ట్రంప్ నిర్ణయం భారతీయ వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. H-1B వీసా హోల్డర్లలో 70 శాతం మంది ఇండియన్స్ ఉన్నారు. ట్రంప్ నిర్ణయంపై భారత్ స్పందించింది. ఒక ప్రకటనలో ‘‘H-1B వీసా ఫీజు పెంపు చాలా కుటుంబాలకు ఇబ్బంది కలిగించే విధంగా మానవతా పరిణామాలను కలిగిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా అధికారులు ఈ విషయాన్ని పరిష్కరిస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు కూడా పేర్కొంది.’’ అని తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న H1B వీసాలపై కొత్త నిర్ణయాలను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలకు, చిన్న, మధ్యస్థాయిలోని టెక్ ఫిర్మ్‌లకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Congress:`నైపుణ్యం కలిగిన కార్మికులకు ఇచ్చే H-1B వీసాలపై అమెరికా 100,000 డాలర్ల (రూ. 88 లక్షలకు పైగా) వార్షిక రుసుమును విధించింది. ట్రంప్ తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల భారతీయులపై చాలా ప్రభావం పడుతోంది. 70 శాతం హెచ్1బీ వీసా హోల్డర్లు భారతీయులే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే, ఈ నిర్ణయం తర్వాత, ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. Read Also: Viral Wedding: పోయే…
H-1B visa: విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కొత్త నిబంధల్ని తీసుకువచ్చింది. విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వానికి 1,00,000 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో ఇది రూ. 88 లక్షలు. ఈ చర్య భారతీయ టెక్కీలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. H-1B వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉన్నారు.
Microsoft: హెచ్-1బీ వీసాదారుల వార్షిక రుసుం లక్ష డాలర్లు విధిస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు రేపటి (సెప్టెంబరు 21)లోపు అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల నియమాలను మార్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1-B వీసాల దరఖాస్తు రుసుమును US$100,000 కు పెంచే ప్రకటనపై సంతకం చేశారు. ఈ చర్య అమెరికాలోని వర్క్ వీసాలపై భారతీయ కార్మికులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. H1-B దరఖాస్తుదారులను స్పాన్సర్ చేయడానికి కంపెనీలు చెల్లించే రుసుమును US$100,000 కు పెంచే ప్రకటనపై ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. Also Read:Cyber Fraud : వృద్ధుడి ఆధార్ కార్డు మానవ…
అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ విద్యార్థులపై చర్య తీసుకుంది. స్టూడెంట్ వీసా హోల్డర్లను గుర్తించి, పరిశీలించడానికి “క్యాచ్ అండ్ రివోవల్” కార్యక్రమాన్ని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. ఇందులో యూదు వ్యతిరేకత లేదా పాలస్తీనియన్లు, హమాస్‌కు మద్దతు ఇచ్చే ఆధారాల కోసం వారి సోషల్ మీడియాను పర్యవేక్షించడం కూడా ఉంది. ఈ చర్య తర్వాత, చాలా మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వారిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అమెరికన్ లాయర్స్ అసోసియేషన్…
Green Card: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంతో పాటు అమెరికా పౌరసత్వంపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు. వలసలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనను పెంచాయి. ముఖ్యంగా భారతీయులతో పాటు ఆ దేశంలో స్థిర నివానం ఏర్పరుచుకోవాలనుకునే వారికి షాక్ ఇచ్చారు. ఆయన ‘‘గ్రీన్ కార్డు’’లపై చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.