H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. వలసల్ని అరికట్టడం, స్థానిక అమెరికన్లకు ఉపాధిని పెంచడం అనే కారణాలు చెబుతూ.. H-1B వీసా దరఖాస్తుదారులపై $100,000 (రూ. 88 లక్షలకు పైగా) రుసుము విధించారు. ఈ ఫీజు పెంచడం వల్ల, అమెరికాకు వచ్చే వ్యక్తులు వాస్తవానికి చాలా నైపుణ్యం కలిగిన వారు అని, అమెరికన్ వర్కర్లను భర్తీ చేస్తారని నిర్ధారిస్తుందని అని ట్రంప్ అన్నారు. ‘‘అమెరికాకు గొప్ప కార్మికులు అవసరం అని, ఈ చర్య దీనికి ఉపయోగపడుతుంది’’ అని చెప్పారు.
Read Also: Duddilla Sridhar Babu : ఇన్ఫోసిస్, టీసీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఎక్కడ.?
అయితే, ట్రంప్ నిర్ణయం భారతీయ వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. H-1B వీసా హోల్డర్లలో 70 శాతం మంది ఇండియన్స్ ఉన్నారు. ట్రంప్ నిర్ణయంపై భారత్ స్పందించింది. ఒక ప్రకటనలో ‘‘H-1B వీసా ఫీజు పెంపు చాలా కుటుంబాలకు ఇబ్బంది కలిగించే విధంగా మానవతా పరిణామాలను కలిగిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికా అధికారులు ఈ విషయాన్ని పరిష్కరిస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు కూడా పేర్కొంది.’’ అని తెలిపింది.