అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ విద్యార్థులపై చర్య తీసుకుంది. స్టూడెంట్ వీసా హోల్డర్లను గుర్తించి, పరిశీలించడానికి “క్యాచ్ అండ్ రివోవల్” కార్యక్రమాన్ని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. ఇందులో యూదు వ్యతిరేకత లేదా పాలస్తీనియన్లు, హమాస్‌కు మద్దతు ఇచ్చే ఆధారాల కోసం వారి సోషల్ మీడియాను పర్యవేక్షించడం కూడా ఉంది. ఈ చర్య తర్వాత, చాలా మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వారిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అమెరికన్ లాయర్స్ అసోసియేషన్ (AILA) నివేదిక ప్రకారం, ఇటీవల ఆ సంస్థ సేకరించిన 327 వీసా రద్దులలో సగం భారతీయ విద్యార్థులవే ఉండడం గమనార్హం.
Also Read:HCA: తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని.. ఉప్పల్ స్టేడియంలో కొడుకు హంగామా
‘ది స్కోప్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్షన్స్ ఎగైనెస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్’ అనే శీర్షికతో AILA విడుదల చేసిన నివేదిక ప్రకారం, వీసాలు రద్దు చేయబడిన విద్యార్థులలో 50 శాతం మంది భారత్ నుంచి, 14 శాతం మంది చైనా నుంచి ఉన్నారు. ఈ డేటాలో దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులు కూడా ఉన్నారు. గత నాలుగు నెలలుగా అమెరికా విదేశాంగ శాఖ మరియు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) విదేశీ విద్యార్థుల కార్యకలాపాలతో సహా వారి డేటాను పరిశీలిస్తోంది.
Also Read:CM MK Stalin: మా తమిళనాడులో అమిత్ షా మార్క్ చాణక్యం నడవదు..
ఈ తనిఖీలు కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించి నిర్వహించబడుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. దీనివల్ల నేర చరిత్ర లేని విద్యార్థులను లేదా క్యాంపస్ నిరసనలతో సంబంధం ఉన్న వారిని అన్యాయంగా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (SEVIS) అనేది అంతర్జాతీయ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ సందర్శకులను ట్రాక్ చేయడానికి US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఉపయోగించే ఒక పోర్టల్.
Also Read:CM MK Stalin: మా తమిళనాడులో అమిత్ షా మార్క్ చాణక్యం నడవదు..
ICE విడుదల చేసిన డేటా ప్రకారం.. SEVIS వ్యవస్థలో 4,736 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసా స్టేటస్ ను రద్దు చేశారు. వీరిలో ఎక్కువ మందికి F-1 వీసాలు ఉన్నాయి. 327 కేసుల్లో 50 శాతం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) హోల్డర్లవే. OPT ద్వారా F-1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు 12 నెలల వరకు అమెరికాలో పని చేయవచ్చు. భారత ప్రభుత్వం వీసాల రద్దు అంశంపై స్పందించింది. “చాలా మంది భారతీయ విద్యార్థులకు వారి F-1 వీసా స్థితి గురించి అమెరికా ప్రభుత్వం నుంచి సందేశాలు వచ్చాయని తెలిపింది. మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాము. మా రాయబార కార్యాలయం, కాన్సులేట్లు విద్యార్థులతో సంప్రదిస్తున్నాయి” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.