Green Card: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడంతో పాటు అమెరికా పౌరసత్వంపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు. వలసలపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనను పెంచాయి. ముఖ్యంగా భారతీయులతో పాటు ఆ దేశంలో స్థిర నివానం ఏర్పరుచుకోవాలనుకునే వారికి షాక్ ఇచ్చారు. ఆయన ‘‘గ్రీన్ కార్డు’’లపై చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.
Indians In US: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే అక్రమంగా యూఎస్‌లో ఉంటున్న భారతీయులను కూడా బహిష్కరించారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికాలోని వేలాది మంది భారతీయులు H-4 వీసా కింద మైనర్లుగా వలస వెళ్లారు.
అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. తనకు రెండు వైపుల వాదనలూ నచ్చాయి.. సమర్థవంతమైన ప్రజలు అమెరికాలోకి రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే కాదు.. అన్ని స్థాయిల వ్యక్తుల గురించి ఈ మాట చెబుతున్నాను అన్నారు.
Donald Trump: ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులు అందరినీ అమెరికా నుంచి తరిమేస్తానని వెల్లడించారు. అలాగే, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం మరింత సులువుగా చేస్తానని కాబోయే యూఎస్ అధ్యక్షుడు తెలిపారు.
H-1B visa: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ‘‘ఇమ్మిగ్రేషన్ పాలసీ’’ ఎలా ఉంటుందని ప్రపంచం అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా భారతీయులపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా H-1B పరిమితులు ప్రధాని నరేంద్రమోడీ ఆత్మనిర్బర్ భారత్ చొరవను ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది.