Nandigam Suresh: టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడిలో ఆరోపణలు ఎదురుకున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజులు గుంటూరు జిల్లా జైలులో విచారణ అనంతరం నేడు ఆయన బయటికి రానున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో భాగంగా నందిగం సురేష్‌ను రెండు రోజుల పాటు పోలీసుల విచారణకు న్యాయస్థానం కస్టడీకి పంపింది. ఆయనను విచారణకు సహకరించాలని తెలిపింది. ఇకపోతే దాడి వెనుక…
గుంటూరులో మరొకసారి ఓ కెమికల్ ఇండస్ట్రీ లో మంటలు చెలరేగాయి.. గుంటూరు రత్నగిరి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.. రెండు రోజుల క్రితం ఇదే కెమికల్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది..
Rescue Operation: బాపట్ల జిల్లాలోని లంక గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొల్లూరు దిగువ భాగంలో ఉన్న లంక గ్రామాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ, ఎస్పీ తుషార్ డ్యూడితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పర్యటించారు.
దేశ స్వాతంత్య్రం కోసం.. తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసిందన్నారు మంత్రి నారా లోకేష్.. మాకు వద్దు తెల్ల దొర తనం, అనే పాటతో స్వాతంత్ర పోరాటం ప్రారంభమైంది.. దేశ స్వాతంత్రం కోసం, తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిందన్నారు..
విజయవాడలో అంబేద్కర్ విగ్రహం మీద దాడి, శిలాఫలకం ధ్వంసం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై దుండగులు చేసిన దాడి ఘటనను, రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈ దాడిని నిరసిస్తూ.. వైసీపీ శ్రేణులు గుంటూరు శంకర్ విలాస్ నుండి లాడ్జి సెంటర్ వరకు క్యాండిల్ నిరసన ర్యాలీ చేశారు.
గుంటూరులో పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఫైల్స్ రోడ్డుపక్కన చెత్తుకుప్ప దగ్గర ప్రత్యక్షం అయ్యాయి.. పోలీస్ శాఖ లేక రెవెన్యూ అధికారులకు సంబంధించినవా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Bank Fraud: గుంటూరులోని జీడీసీసీ బ్యాంకులో ఒక్కొక్కటిగా స్కామ్స్ వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకులో రుణాల పేరుతో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు ప్రచారం కొనసాగుతుంది. రైతులు కాని వారి ఆధార్ కార్డులు సేకరించి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి, రైతుల రుణాల పేరుతో బ్యాంకు సొమ్మును స్వాహా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.
South Central Railway: రైల్వేల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే లైన్ల ఆధునీకరణతో పాటు సింగిల్ లైన్ రూట్లను డబుల్ లైన్లుగా, డబుల్ లైన్ రూట్లను ట్రిపుల్ లైన్లుగా మార్చేందుకు పనులను చేపట్టారు.