గుంటూరు గొంతు ఎండకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉందని.. ఏడాదిలోపు నిధులు సేకరించి పనులు ప్రారంభిస్తామని.. గుంటూరు ప్రజలకు నీళ్లు అందిస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. గుంటూరు నగరంలో భాగమైన గోరంట్లలో కొన్నేళ్లుగా ఆగిపోయిన రిజర్వాయర్ నిర్మాణాలను తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులైన నసీర్ అహ్మద్, పిడుగురాళ్ల మాధవి, బూర్ల రామాంజనేయులుతో కలిసి పెమ్మసాని శనివారం పరిశీలించారు.
గుంటూరులోని ఆటోనగర్ లో గురువారం నాడు సాయంత్రం జరిగిన మోటార్ ఫీల్డ్ సోదరుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చిన వాళ్లం విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమన్నారు. గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు.
అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని అమరావతిలో కట్టడాలను పలువురు నేతలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు.
పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలా చూడటం, విద్యా, ఆర్థిక పరంగా వృద్ధిలోకి తీసుకురావటం అనే అంశాలను మాత్రమే చూస్తూ ఒక తండ్రిలా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉమ్మడి కూటమిలో అసంతృప్తి వెల్లువెత్తింది. తమకు న్యాయం జరగలేదని టీడీపీపై జనసేన నాయకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గడచిన రెండేళ్లుగా తమకే సీటు అని ప్రచారం చేసి.. చివరి నిమిషంలో టీడీపీ సీటు దక్కించుకుందని జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చెప్పేంతవరకు, జనసేనకు న్యాయం జరిగేంత వరకు.. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని గుంటూరు జనసేన నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ అల్టిమేటం జారీ చేశారు. టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలు దూరంగా ఉండాలనే…