గుంటూరు రైల్వేస్టేషన్‌లో మూడు రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. నరసాపురం నుంచి హుబ్లీకి, గుంటూరు నుంచి విశాఖకు, రేణిగుంట నుంచి నంద్యాలకు మూడు రైళ్లను కేంద్రమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు రైళ్లను ప్రారంభించామని, నంద్యాల నుంచి రేణిగుంట రైలు తిరుమల భక్తులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందని తెలిపారు
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట పండింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీలలో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది.
ఈసారి నరసరావుపేట నుండి కాదు గుంటూరు నుంచి పోటీ చేయమని అధిష్టానం చెప్పిందన్నారు. కానీ, తనకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదని ఎంపీ స్పష్టం చేశారు.. పల్నాడులో చాలా పనులు సగం సగం మిగిలిపోయాయని.. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉందని అంటున్నారు ఎంపీ..
Minister Vidadala Rajini Fires on TDP: ప్రశాంతంగా ఉన్న గుంటూరు పశ్చిమలో కావాలనే అలజడి సృష్టిస్తున్నారని మంత్రి విడదల రజిని అన్నారు. టీడీపీ శ్రేణులు భయపెడితే.. భయపడే రకం తాను కాదన్నారు. తమ సొంత భవనంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే.. టీడీపీ శ్రేణులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అని ప్రశ్నించారు. వైసీపీ కుటుంభం అప్రమత్తంగా ఉండాలని, రెచ్చగొట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన…
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని కార్యాలయంపై జరిగిన దాడిని ఎమ్మెల్యే మద్దాలి గిరి ఖండించారు. దాడికి పాల్పడిన టీడీపీ రౌడీ మూకల్ని ప్రజలు అస్సలు క్షమించరన్నారు. బీసీ మహిళ గుంటూరులో పోటీ చేయకూడదా? అని మద్దాలి గిరి ప్రశ్నించారు. ప్రతి ఎన్నిక సందర్భంలో ఏదో ఒక దాడి చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని ఎమ్మెల్యే మద్దాలి గిరి విమర్శించారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి మీడియాతో మాట్లాడుతూ… ‘టీడీపీ రౌడీ మూకల్ని ప్రజలు…
AP Minister Vidadala Rajini React on Attck on Guntur Party Office: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఖండించారు. టీడీపీ గుండాలే ఈ దాడి చేశారని, దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దాడని, రాళ్లు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారన్నారు. బీసీ మహిళనైన తనపై కుట్రలు చేస్తున్నారని, ఇలాంటి దాడులతో ఏమాత్రం భయపెట్టలేరని మంత్రి…
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుంటూరులో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విద్యానగర్‌లోని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని నూతన పార్టీ ఆఫీస్‌పై టీడీపీ-జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి.. గుంపును చెదరగొట్టారు. కొంతమంది టీడీపీ-జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మంత్రి విడుదల రజిని కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఉంది. ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా…
Sanitation Workers Strike in Guntur: ఉమ్మడి గుంటూరు జిల్లాలో చెత్త పేరుకుపోయింది. గడిచిన ఐదు రోజులుగా పారిశుధ్య కార్మికులు సార్వత్రిక సమ్మెకు దిగడంతో.. ఇళ్లల్లో చెత్త పేరుకుపోయింది. ఇండిపెండెంట్ హౌస్‌లు, అపార్ట్మెంట్స్ అన్న తేడా లేకుండా ఇళ్లలో చెత్త నిండిపోయింది. ఓ పక్క చలికాలం, మరోపక్క దోమల బెడద ఎక్కువ అవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త విపరీతంగా పేరుకుపోవడంతో దుర్గంధంతో పాటు రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. Also Read: ISRO:…
ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఎక్కవయ్యాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ నగరంలో ఓ బాలుడిపై దాడికి చేయడంతో చిన్నారి మ`తి చెందిన ఘటన కలకలం రేపింది. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే అద`ష్టవశాత్తు బాలుడికి ప్రాణాపాయం తప్పింది. వివరాలు.. గుంటూరు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. పట్టణంలోని సంపత్‌నగర్‌లో ఓ బాలుడిపై మూకుమ్ముడిగా వీధి కుక్కలు దాడి…