గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్రంలోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ లో ముగ్గురు దొంగలు చోరీకి ప్రయత్నించి విఫలం అయ్యారు. షట్టర్ తాళాలు పగలగొట్టి బ్యాంక్ లోకి ముగ్గురు దొంగలు ప్రవేశించారు. బ్యాంక్ లోకి ముగ్గురు దొంగలు వెళ్తుండగా పోలీస్ పెట్రోలింగ్ సైరన్ మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు.
గుంటూరులో భారీ చోరీ జరిగింది. కొత్తపేట మంగళబావి వీధిలో పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు.
డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే మాట్లాడుతూ.. గత కొద్ది సంవత్సరాలుగా కోవిడ్ తో పాటు ఇతర కారణాలతో మూతపడ్డ కార్డియాక్ సర్జరీ విభాగం.. అనేక అవాంతరాలు దాటి నేటి నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో గుండె సర్జరీలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
గుంటూరు నగరంపాలెం ఎస్సై రవితేజను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఎస్సై రవితేజ తనను మోసగించారంటూ ఓ యువతి మూడు రోజుల క్రితం నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కాగా వైసీపీ ఎమ్మెల్యే గిరిధర్ తల్లి శివపార్వతి(68) గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే.
AP BRS office: ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రాష్ట్ర కార్యాలయం ప్రారంభమైంది.. గుంటూరులోని ఆటోనగర్లో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం.. బీజేపీకి దేశంలో ఎదురు గాలి వీస్తోందన్నారు. మతతత్వ పార్టీ బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలంటే ఒక్క బీఆర్ఎస్ వల్లనే సాధ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తీసుకుని అన్ని రాష్ట్రాలను…